సాధారణంగా సెలబ్రిటీల పెళ్లంటే వరుడు ఎవరు? వధువు ఎవరు? వారు ఏం చేస్తుంటారు? ఎలా ఉంటారు? వారి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? వారు ఇంతకు ముందు సినిమాలో నటించారా? లేదా? అని వారికి సంబంధించిన ప్రతీ విషయాన్ని తెలుసుకోవాలని ఫ్యాన్స్, సినీ ప్రేక్షకులు అనుకుంటారు. అలానే ఇప్పుడు టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్‌కు కాబోయే భార్య జైనాబ్ రావ్డ్జీ కూడా ఎవరు అని తెలుసుకోవాలని చాలా మంది ఇంటర్నెట్లో తెగ సెర్చ్ చేసేస్తున్నారు.
Also Read: అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ .. ప్రకటించిన నాగార్జున
జైనాబ్ రావ్డ్జీ ఎవరు?
అందుతున్న సమాచారం ప్రకారం.. జైనాబ్ రావ్డ్జీ తండ్రి జుల్ఫీ రావ్డ్జీ అని తెలిసింది. ఆయన మరెవరో కాదు.. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారుగా పనిచేసినట్లు సమాచారం. అంతేకాకుండా మిడిల్ ఈస్ట్ దేశాలకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సేవలు అందించినట్లు తెలుస్తోంది.
అది మాత్రమే కాదండోయ్.. జగన్, నాగార్జునల ఫ్యామిలీలతో కూడా వారికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. అయితే ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే.. అక్కినేని అఖిల్ కంటే జైనాబ్ రావ్డ్జీ 9 ఏళ్లు పెద్దంట. ప్రస్తుతం జైనాబ్ వయస్సు 39 ఏళ్లు కాగా.. అఖిల్ వయస్సు 30 అని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి చాలా మంది షాక్ అవుతున్నారు. మరికొందరేమో ఆ.. ఏజ్‌తో సంబంధం ఏముందిలే అంటూ చెప్పుకొస్తున్నారు.
Also Read: ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన స్టార్ ఆటగాళ్లు
ఇక జైనాబ్ రావ్డ్జీ అప్పుడెప్పుడో ‘మీనాక్షి’ అనే సినిమా కూడా చేసినట్లు సమాచారం. ఇక జైనాబ్ రావ్డ్జీ ఒక ఆర్టిస్టు అని కూడా సమాచారం. గతంలో హైదరాబాద్‌లో రిఫ్లెక్షన్ పేరుతో కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో ఓ పెయింట్ ఎగ్జిబిషన్ పెట్టింది. ప్రస్తుతం ముంబైలో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆమె ఎక్కువగా లండన్, దుబాయ్, ఇండియా వంటి దేశాలలో తిరుగుతుందని ఇన్ స్టా చూస్తే అర్థం అవుతుంది.
Also Read: ఊహించని రేంజ్లో ఐపీఎల్ బిజినెస్.. మూడు రెట్లు పెరిగిన పెట్టుబడి!