Akhil Akkineni Wedding: ఘనంగా అఖిల్ అక్కినేని పెళ్లి.. పంచెకట్టులో ప్రశాంత్ నీల్ సందడి!

అక్కినేని అఖిల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈరోజు ఉదయం తన ప్రేయసి జైనాబ్ మెడలో మూడుముళ్ళు వేశారు. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. సినీ ప్రముఖులు చిరంజీవి, రామ్ చరణ్, ప్రశాంత్ నీల్, శర్వా తదితరులు పెళ్లి వేడుకకు హాజరయ్యారు.

New Update
akhil akkineni grand wedding

akhil akkineni grand wedding

Akhil Akkineni Wedding:  అక్కినేని ఇంట పెళ్లి బాజాలు మోగాయి. నాగార్జున- అమల దంపతుల చిన్న కుమారుడు అఖిల్ వివాహం (akhil akkineni wedding) ఈరోజు తెల్లవారుజామున 3. 30 నిమిషాలకు ఘనంగా జరిగింది. అఖిల్ ముంబైకి చెందిన తన ప్రేయసి జైనాబ్ ని (zainab) వివాహం చేసుకున్నారు. ఎంతో ప్రైవేట్ గా నాగార్జున నివాసంలో జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, పలువురు సినీ సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. గతేడాది నవంబర్ లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. ఇప్పుడు మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. దీంతో అక్కినేని అభిమానులు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

ఇండస్ట్రీ ప్రముఖులు, రాజకీయ నాయకుల కోసం జూన్ 8 ఆదివారం రోజున గ్రాండ్ రిషెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ నాయకులు హాజరు కానున్నారు. సినీ సెలెబ్రెటీలు, రాజకీయ నాయకులతో పాటు పలువురు క్రికెటర్లు కూడా సందడి చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే జరిగిన వివాహ వేడుకకు క్రికెటర్ తిలక్ వర్మ హాజరై నూతన వధూవరులను విష్ చేశారు. 

అఖిల్ పెళ్ళిలో టాలీవుడ్ స్టార్ల సందడి 

ఈరోజు నాగార్జున నివాసంలో జరిగిన వివాహ వేడుకలో  చిరంజీవి, రామ్ చరణ్ దంపతులు, డైరెక్టర్ ప్రశాంత్ నీల్,  శర్వా నంద్ వంటి తారలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. పెళ్లి సందడిలో నాగ చైతన్య తన భార్య శోభిత ధూళిపాళతో కలిసి కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు.  డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పంచకట్టులో కనిపించి కనువిందు చేశారు. 

రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా ఎంతో  స్టైలిష్ గా కనిపించారు. 

Also Read: HariHara VeeraMallu: పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మరోసారి షాక్! 'హరిహరవీరమల్లు' పై కీలక అప్డేట్

Advertisment
Advertisment
తాజా కథనాలు