Aishwarya Rai: ఇకపై ఐశ్వర్య ఫొటోలు వాడితే కుదరదు!.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్.. తన అనుమతి లేకుండా సోషల్ మీడియాలో, పలు వాణిజ్య ప్రకటనల్లో  తన పేరు, ఫొటోలను వాడుకుంటున్నారని  ఇటీవలే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా తీర్పును వెలువరించింది.

New Update
Aishwarya Rai Bachchan

Aishwarya Rai Bachchan

Aishwarya Rai:   బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ అనుమతి లేకుండా  తన ఫోటోలను, వీడియోలను వాడుకుంటున్నారని ఇటీవలే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పలు సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్  వాణిజ్య ప్రయోజనాల కోసం  తన ఫోటోలను వాడుకుంటున్నాయని, అంతేకాకుండా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇలా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, తన గోప్యతా  హక్కులను కాపాడాలని   న్యాయస్థానాన్ని కోరారు. 

ఐశ్వర్యకు ఊరట.. 

తాజాగా దీనిపై విచారణ జరిపిన కోర్టు  తీర్పు వెలువరించింది. వాదోపవాదనల తర్వాత ఐశ్వర్యకు అనుకూలంగా తీర్పు వచ్చింది.  ఇకపై ఐశ్వర్య రాయి అనుమతి లేకుండా ఆమె ఫొటోలను, పేరును వాడడానికి వీల్లేదని కోర్టు ఆదేశించింది. ఈ  రకమైన దుర్వినియోగం ఆమెకు ఆర్థికంగా నష్టం కలిగించడంతో పాటు ఆమె గౌరవ, ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని కోర్టు పేర్కొంది.  ఈ మేరకు ఆమె ప్రచార, వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. 


ఐశ్వర్య పిటీషన్ విచారించిన న్యాయస్థానం.. అందులో  గుర్తించిన యూఆర్‌ఎల్‌లను  తొలగించి వెంటనే బ్లాక్ చేయాలని సదరు ఇ-కామర్స్ వైబ్‌ సైట్స్, గూగుల్ సహా ఇతర ప్లాట్ ఫార్మలను ఆదేశించింది. నోటీసులు అందిన 72 గంటలోపు ఐశ్వర్య పేర్కొన్న యూఆర్‌ ఎల్స్ బ్లాక్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆ యూఆర్‌ఎల్స్‌ అన్నీ కూడా  ఏడు రోజుల్లో బ్లాక్ అయ్యేలా  చూడాలని కేంద్ర ఐటీ, సమాచార శాఖకు కోర్టు సూచించింది. 

Also Read: Kishkindhapuri Review: సస్పెన్స్ తో చంపేశాడు భయ్యా.. లాస్ట్ మినిట్ ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్.. 'కిష్కిందపురి' ఫస్ట్ రివ్యూ ఇదే!

Advertisment
తాజా కథనాలు