/rtv/media/media_files/2025/09/15/adolescence-2025-09-15-12-46-56.jpg)
adolescence
Emmy Awards 2025: సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఎమ్మీ అవార్డ్స్ వేడుక లాస్ ఏంజిల్స్ లోని పీకాక్ థియేటర్ వేదికగా అట్టహాసంగా జరిగింది. హాలీవుడ్ కి చెందిక ప్రముఖ నటీనటులు ఈ వేడుకలో సందడి చేశారు. ఈ అవార్డు వేడుకలో 'అడాల్‌సెన్స్' నటుడు ఓవెన్ కూపర్ చరిత్ర సృష్టించాడు. 15 ఏళ్ళ వయసులో ఉత్తమ సహాయ నటుడి విభాగంలో ఎమ్మీ అవార్డు అందుకున్న పురుషుడిగా రికార్డు నెలకొల్పాడు.
నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన 'అడాల్‌సెన్స్' సీరీస్ లో తన నటనకు గానూ ఒవేన్ ఒవేన్ ఈ అవార్డును అందుకున్నాడు. ఇందులో ఓవెన్ 13 ఏళ్ల జామీ కిల్లర్ అనే స్కూల్ విద్యార్ధి పాత్రలో నటించాడు. టీనేజ్ యువత పై సోషల్ మీడియా ప్రభావం, పిల్లలు ఇంటర్నెట్ లో ఏం వెతుకుతున్నారు? వాళ్ళ స్కూల్ లో ఏం జరుగుతుంది? క్లాస్ రూమ్ లో వారి చుట్టూ వాతావరణం ఎలా ఉంటుంది? వాళ్ళను చెడు మార్గం వైపు ప్రభావితం చేస్తున్న అంశాలేటి..? ఇలాంటి అనేక ప్రశ్నలకు తెరలేపేలా ఈ సీరీస్ కొనసాగుతుంది.
#adolescence star Owen Cooper is now a first-time Emmy winning actor & youngest male actor at the age of 15!! His performance was unreal. ‘Adolescence’ in general is just a heart-wrenching/edge of your seat story. Deserves all the accolades. pic.twitter.com/znuaZHjwpd
— CJ Johnson (@cjjohnsonjr) September 15, 2025
తొలి సినిమాతోనే ఎమ్మీ అవార్డు..
ఓవెన్ కూపర్ తన తొలి సినిమాతోనే ఎమ్మీ అవార్డు గెలుచుకొని సత్తాచాటాడు. 'అడాల్‌సెన్స్' సీరీస్ లో నటించకముందు కూపర్‌కు ఎలాంటి ప్రొఫెషనల్ నటనా అనుభవం లేదు. ఈ సిరీస్ ద్వారానే మొదటిసారి అతడికి నటించే అవకాశం దక్కింది. మొదటిసారి అయినప్పటికీ ఓవెన్ తన నటనలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించాడు.
Not me tearing up 🥹 He has become the youngest male actor ever to win an Emmy! Playing one of the most multi layered characters and he did it brilliantly. So well deserved, do not miss on this drama #Emmys#OwenCooper#Adolescencepic.twitter.com/l5FaoE6CWe
— ⟬⟭ ⟭⟬⁷ (@Jasparina7) September 15, 2025
అవార్డు అందుకున్నసందర్భంగా ఓవెన్ స్టేజ్ పై మాట్లాడుతూ.. తాను అవార్డు గెలుస్తానని ఊహించలేదని, ఇది తనకు చాలా గొప్ప అనుభూతిని ఇస్తోందని పేర్కొన్నాడు. ఈ విజయాన్ని తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు అంకితం చేస్తున్నట్లు తెలిపాడు.
ఉత్తమ సహాయ నటుడు కేటగిరీతో పాటు 'అడాల్‌సెన్స్' సీరీస్ మొత్తం 5 విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. 'ఉత్తమ లిమిటెడ్ సిరీస్', 'ఉత్తమ నటుడు', 'ఉత్తమ సహాయ నటి', 'ఉత్తమ దర్శకత్వం' 'ఉత్తమ రచన' విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది.
అవార్డు విజేతలు
- బెస్ట్ డ్రామా సిరీస్ : ది పిట్
- బెస్ట్ యాక్టర్ : నోహ్ వైల్ (ది పిట్)
- బెస్ట్ యాక్ట్రెస్ : బ్రిట్నీ లీ లోయర్ (సెవెరెన్స్)
- బెస్ట్ కామెడీ సిరీస్: ది స్టూడియో
- బెస్ట్ సిరీస్: అడాల్‌సెన్స్
- ఉత్తమ నటుడు (సిరీస్): స్టీఫెన్ గ్రాహం (అడాల్‌సెన్స్)
- బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ (సిరీస్) : ఎరిన్ డోహెర్టీ (అడాల్‌సెన్స్)
- బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ (సిరీస్) : ఓవెన్ కూపర్ (అడాల్‌సెన్స్)
- ఉత్తమ స్క్రిప్ట్ రైటర్: లాస్ట్ వీక్ టునైట్..(సాటర్డే నైట్ లైవ్)
- బెస్ట్ డైరెక్టర్ : ఆడమ్ రాండాల్ (స్లో హార్సెస్)
- బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ (కామెడీ): హన్నా ఐన్‌బైండర్ (హ్యాక్స్)
- బెస్ట్ డైరెక్టర్ (లిమిటెడ్ సిరీస్) : ఫిలిప్ బారంటిని(అడాల్ సెన్స్)
- బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ (కామెడీ): జెఫ్ హిల్లర్ (సమ్‌బడీ సమ్‌వేర్)
- బెస్ట్ రియాలిటీ షో: ది ట్రెయిటర్స్
Also Read: Horror Movie: ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న హారర్ మూవీ! ఒక్క సీన్ కూడా వదలరు!