/rtv/media/media_files/2025/12/18/dacoit-teaser-2025-12-18-12-11-18.jpg)
Dacoit Teaser
Dacoit Teaser: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్(Adivi Sesh), హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) కలిసి నటిస్తున్న తాజా సినిమా ‘డెకాయిట్’. ‘ఒక ప్రేమ కథ’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమాతో దర్శకుడు షానీల్ డియో సినీ పరిశ్రమకు కొత్తగా పరిచయం అవుతున్నారు.
ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ ఆసక్తిని మరింత పెంచుతూ తాజాగా చిత్రబృందం టీజర్‌ను విడుదల చేసింది. టీజర్ ప్రారంభం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కింగ్ నాగార్జున నటించిన పాత సినిమాలోని ఫేమస్ పాట ‘కన్నెపెట్టరో కన్నుకొట్టరో’ను బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తూ సీన్ మొదలవుతుంది. ఇది ప్రేక్షకుల్లో నాస్టాల్జియా ఫీల్‌ను తీసుకొస్తుంది.
ఆ తర్వాత టీజర్ మొత్తం యాక్షన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ సాగుతుంది. ఇందులో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ఇద్దరూ దొంగల పాత్రల్లో కనిపించబోతున్నట్టు టీజర్ స్పష్టంగా చెబుతోంది. వీరి మధ్య ప్రేమ, యాక్షన్, డ్రామా కలిసి సాగనున్నట్టు అర్థమవుతుంది. అడివి శేష్ స్టైలిష్ లుక్‌లో, మృణాల్ బోల్డ్ క్యారెక్టర్‌లో కనిపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ. ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టెక్నికల్‌గా కూడా సినిమా చాలా రిచ్‌గా ఉండబోతుందన్న టీజర్ చూస్తే తెలుస్తోంది.
ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్ర సినిమాకు మరింత బలం ఇవ్వనుందని అంచనా. యాక్షన్‌తో పాటు బలమైన కథ, భావోద్వేగాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని టీజర్ స్పష్టంగా చెబుతోంది.
‘డెకాయిట్’ సినిమా మార్చి 19న విడుదల కానుంది. ఇప్పటికే టీజర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా, థియేటర్లలో ఎలాంటి స్పందన పొందుతుందో చూడాలి. అడివి శేష్ అభిమానులతో పాటు మృణాల్ ఠాకూర్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు.
Follow Us