Actress Fiance Suicide: హైదరాబాద్ లో సినీనటి కాబోయే భర్త సూసైడ్.. ఉరేసుకునే ముందు షాకింగ్ సెల్ఫీ వీడియో!

సినీ నటి సోహానీ కుమారి కాబోయే భర్త  సవాయి సింగ్ సూసైడ్ ఘటన ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్న తన ఫ్లాట్ లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాబోయే భర్త మరణంతో సోహానీ శోకసంద్రంలో  మునిగిపోయింది.

New Update
Sohani Kumari  fiance committed suicide

Sohani Kumari fiance committed suicide

Actress Fiance Suicide:  సినీ నటి సోహానీ కుమారి కాబోయే భర్త  సవాయి సింగ్ సూసైడ్ ఘటన ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్న తన ఫ్లాట్ లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాబోయే భర్త మరణంతో సోహానీ శోకసంద్రంలో  మునిగిపోయింది. అయితే ఆత్మహత్యకు ముందు సవాయి సింగ్ ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో తాను చేసిన తప్పులే తనకు ఈ పరిస్థితి రావడానికి కారణమంటూ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.  

జులైలో నిశ్చితార్థం.. 

రాజస్థాన్ కి చెందిన నటి  సోహానీ- సవాయి సింగ్ గతేడాది జులై నెలలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత నిశ్చిత్సర్డ్సమ్ వరకు వెళ్ళింది. ఎంగేజ్మెంట్ తర్వాత గత కొన్ని నెలలుగా వీరిద్దరూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని ఒకే చోట కలిసి ఉంటున్నారు. ఈ మధ్యలో వీరిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో  కానీ, సవాయి సింగ్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఇంట్లోని డైనింగ్ ఏరియాలో సవాయి ఉరేసుకొని చనిపోయారు.

సంఘటన జరిగిన రోజు సవాయి సింగ్ ఆఫీసుకు వెళ్లిన తర్వాత, సోహానీ కుమారి కూడా బయటకు వెళ్లింది. ఆ తర్వాత ఆమె ఇంటికి తిరిగి వచ్చేసరికి సవాయి సింగ్ ఆత్మహత్య చేసుకొని కనిపించాడు. దీంతో సోహానీ వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్త్తు చేపట్టారు.

ఎక్స్గర్ల్ఫ్రెండ్నిమర్చిపోలేక 

విచారణలో భాగంగా చనిపోయేముందు సవాయి రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియోను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని మర్చిపోలేకపోవడం, ఆర్ధిక ఇబ్బందులు అతడిని బాగా వేధించాయని.. అందుకే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని సోహానీ అనుమానం వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు సవాయి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పేరును విచారణ లిస్ట్ లో చేర్చారు. 

నిర్మాతగాకూడా 

ఇదిలా ఉంటే..  నటి సోహానీ కుమారి హిందీ సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. వాటిలో  'యే హై చాహతే' సీరియల్ ఆమెకు నటిగా  మంచి పేరు తీసుకొచ్చింది.  నటిగా మంచి పేరు తెచ్చుకున్న సోహానీ రీసెంట్ గా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. మంచి కథలను ఎంచుకుంటూ నిర్మాతగా కూడా సత్తా చాటేందుక ప్రయత్నిస్తోంది. 

ప్రస్తుతం  'ప్యార్ టెస్టింగ్' అనే సీరీస్ నిర్మిస్తోంది. 'ప్యార్ టెస్టింగ్' ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని..ఇందులో ప్రేమ, భావోద్వేగాలు, నవ్వులు ఉంటాయని సోహాని తెలిపారు. సోహానీ 'పైథానీ' మేరీ', 'ఖోజ్ పర్‌ఛాయియో కే ఉస్ పర్' , 'డైవోర్స్ కే లియే కుచ్ భీ కరేగా' వంటి కొన్ని ఇండిపెండెంట్  ప్రాజెక్టులను కూడా  నిర్మించారు.

Also Read: Cinema: అయ్యో.. మహేష్ నో చెప్పాడు.. బన్నీ బ్లాక్ బస్టర్ కొట్టాడు! ఆ సినిమా ఏంటో తెలుసా?

Advertisment
తాజా కథనాలు