/rtv/media/media_files/shraddha-9.jpg)
ఈ క్రమంలో శ్రద్ధ నెక్స్ట్ ప్రాజెక్ట్ సంబంధించి నెట్టింట ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతోంది. జానపద ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన మహారాష్ట్రకు చెందిన 'విఠాబాయి నారాయణ్గావ్కర్' బయోపిక్ లో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
/rtv/media/media_files/shraddha-5.jpg)
ఈ చిత్రానికి 'ఛావా' ఫేమ్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తుండగా.. , దినేష్ విజన్ నిర్మిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో శ్రద్ధ 'విఠాబాయి' గా కనిపించబోతుంది. విఠాబాయి 'లవానీ', 'తమాషా' నృత్యాలకు ప్రసిద్ధి.
/rtv/media/media_files/shraddha-3.jpg)
అయితే విఠాబాయి అభిమానుల్లో 'తమాషా క్వీన్' అనే పేరుతో ప్రసిద్ధి చెందిన కారణంగా మొదట ఈ సినిమాకు మొదటగా 'తమాషా' అనే టైటిల్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ తర్వాత 'విట్టా' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/08/21/shraddha-kapoor-pic-one-2025-08-21-17-45-43.png)
కేవలం ఆమె కళారూపం గురించి మాత్రమే కాకుండా, విఠాబాయి వ్యక్తిగత జీవితాన్ని కూడా సినిమాలో చూపించబోతున్నారట. అందుకే 'తమాషా' నుంచి 'విట్టా' అని టైటిల్ చేంజ్ చేసినట్లు సమాచారం.
/rtv/media/media_files/2025/08/21/shraddha-kapoor-pic-two-2025-08-21-17-45-43.png)
అలాగే మహారాష్ట్ర జానపద కళకు అది ఎంత ముఖ్యమైనదో కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారు.
/rtv/media/media_files/2025/08/21/shraddha-kapoor-pic-three-2025-08-21-17-45-43.png)
ఇదిలా ఉంటే .. శ్రద్ధా కపూర్ గత సినిమాలలో గ్లామర్ పాత్రలకు ప్రసిద్ధి చెందారు. కానీ, ఇప్పుడు విఠాబాయి లాంటి ధైర్యవంతురాలి, నిజమైన వ్యక్తిత్వం ఉన్న పాత్రలో నటించడం ఆమెకు ఒక సవాలు.
/rtv/media/media_files/2025/08/21/shraddha-kapoor-pic-four-2025-08-21-17-45-43.png)
ఈ సినిమాతో శ్రద్ద తన నటనలో మరింత పరిణతి సాధిస్తారని, ఇది ఆమె కెరీర్‌కి ఒక టర్నింగ్ పాయింట్‌గా మారుతుందని నెటిజన్లు భావిస్తున్నారు.
/rtv/media/media_files/2025/08/21/shraddha-kapoor-pic-five-2025-08-21-17-45-43.png)