/rtv/media/media_files/2025/07/12/mahesh-babu-marrying-sandra-2025-07-12-15-58-20.jpg)
Mahesh Babu marrying sandra
Sandra Jaichandran: 'ముద్దమందారం', 'శుభస్య శీఘ్రం', 'కలవారి కోడళ్ళు' సహా పలు సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన నటి సాండ్రా జైచద్రన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన ప్రేమ గురించి బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ. నేను వెతక్కుండానే.. నువ్వు నాకు దొరకవు! నువ్వు నా అద్భుతం! అంటూ తన ప్రియుడిని పరిచయం చేసింది. దీంతో అభిమానులతో సహా బుల్లితెర నటులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. అమర్ దీప్, కీర్తి భట్, టేస్టీ తేజ, విష్ణు ప్రియ, మహేశ్వరి, చైత్రరాయ్, సిద్దార్థ్ వర్మ పలువురు ఈ జంట పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
అబ్బాయి ఎవరు?
అయితే సాండ్రా పెళ్లి చేసుకోబోతున్న ఆ అబ్బాయి మరెవరో కాదు! అతడు కూడా బుల్లితెర ప్రేక్షకులందరికీ బాగా సుపరిచితుడే. అతనే మహేష్ బాబు కాళిదాసు! 'మనసిచ్చిచూడు', శుభస్య శీగ్రమ్ వంటి సీరియల్స్ లో మెయిన్ లీడ్ గా నటించాడు. ముఖ్యంగా 'మనసిచ్చిచూడు' సీరియల్ లో ఆది పాత్రతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.
అలా ప్రేమలో
మహేష్, సాండ్రా 'శుభస్య శీగ్రమ్' సీరియల్ లో కలిసి పనిచేశారు. ఈ సీరియల్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సీరియల్ పూర్తయిన తర్వాత వీరిద్దరూ 'SaMa ప్రయాణం' పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశారు. ఇందులో ఇద్దరూ కలిసి రెగ్యులర్ గా వీడియోలు పోస్ట్ చేసేవారు. అలాగే ఇద్దరూ తరచు ట్రిప్స్, వెకేషన్స్ వెళ్తూ కనిపించేవారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు నెటిజన్లు ఎప్పటినుంచో రూమర్లు మొదలయ్యాయి. ఇప్పుడు ఆ రూమర్లనే నిజం చేస్తూ తమ ప్రేమను అధికారికంగా ప్రకటించింది ఈ జంట. ఇదిలా ఉంటే శాండ్రాకు 19 ఏళ్లకే పెళ్లయింది. కానీ అతడి వేరే అమ్మాయితో కూడా రిలేషన్ లో ఉన్నాడని తెలియడంతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత తాను మానసికంగా ఎంతో కుంగిపోయినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది శాండ్రా.
Also Read:Shilpa Shetty: అబ్బా! గ్రీన్ శారీలో ఫిదా చేస్తున్న శిల్పా.. ఫొటోలు చూస్తే చూపు తిప్పుకోలేరు!