/rtv/media/media_files/2024/12/27/70waptflha0uopAiue82.jpg)
roja daughter
Roja Daughter: నటి రోజా, ఫిల్మ్ డైరెక్టర్ సెల్వమణి కూతురు అన్షు మాలిక 20 ఏళ్ళ వయసులోనే అరుదైన ఘనత సాధించింది. ఇటీవలే నైజీరియా లాగోస్‌లో జరిగిన గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ ఫెస్టివల్‌లో "సోషల్ ఇంపాక్ట్" విభాగంలో అన్షు గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని రోజా తన సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేసింది.
ALSO READ: డెడ్ బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. శవం దొరకలేదని అమాయకుణ్ని హతమార్చారు?
Your hard work and perseverance have paid off congratulations dear #AnshuMalika ❤️ thank you team @TheDeccanMirror 💐 https://t.co/02DYIbTp2o
— Roja Selvamani (@RojaSelvamaniRK) December 27, 2024
7 ఏళ్ళ వయసులోనే..
చిన్న వయసులోనే అన్షు డెవలపర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సోషల్ వర్కర్‌గా గుర్తింపు పొందింది. 7 ఏళ్ల వయస్సులో కోడింగ్ ప్రారంభించిన అన్షు, 17 ఏళ్ళ వయస్సులో "ఫేస్ రికగ్నిషన్ బాట్ యూసింగ్ డీప్ లర్నింగ్" అనే థీసిస్ రాసింది. ఈ రీసెర్చ్ పేపర్ అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురించబడింది. గతంలో అన్షు రాసిన ‘‘ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్” అనే పుస్తకానికి 'జి టౌన్ మ్యాగజైన్' సౌత్ ఇండియా విభాగంలో బెస్ట్ ఆథర్ కేటగిరీ కింద బహుమతి లభించింది. మహిళల సాధికారతపై కూడా ఆమె అనేక కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఈ గ్లోబల్ అవార్డుతో అన్షు సామాజిక మార్పు కోసం చేస్తున్న కృషి అంతర్జాతీయ గుర్తింపును పొందింది. అంతేకాదు ఈ అవార్డు ఆమె తదుపరి ప్రాజెక్టులను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి కావాల్సిన దారులను తెరిచింది.
ALSO READ: కామారెడ్డిలో విషాదం..ఒకేసారి మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ మృతి..ఎస్సై అదృశ్యం!
Also Read: 'భారతీ.. ట్యూషన్ ఫీజు కట్టావా'.. అబ్బా! ఈగ సినిమా లెవెల్లో రాజమౌళి ఫస్ట్ లవ్