Renu Desai: సన్యాసం తీసుకుంటా..? రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్!

సీనియర్ నటి రేణు దేశాయ్ ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో భవిష్యత్తులో సన్యాసం తీసుకునే అవకాశం ఉంది అంటూ చేసిన వ్యాఖ్యలు  ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

New Update
renu desai

renu desai

Renu Desai: సీనియర్ నటి రేణు దేశాయ్ ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో భవిష్యత్తులో సన్యాసం తీసుకునే అవకాశం ఉంది అంటూ చేసిన వ్యాఖ్యలు  ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించిన నటి రేణు దేశాయ్.. ఆ తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇచ్చారు. మళ్ళీ రీసెంట్ గా 2023 లో  'టైగర్ నాగేశ్వరావు'  సినిమాతో కమ్ బ్యాక్ ఇచ్చారు. అప్పటి నుంచి టీవీ షోలలో, సినిమా ఈవెంట్లలో, సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా కనిపిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన సినీ కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

సన్యాసం తీసుకుంటా?

రేణు దేశాయ్ తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. తనకు ఇప్పుడు మంచి పాత్రలు వస్తున్నాయని తెలిపారు. ఎక్కువగా మహిళా ప్రాధాన్యం ఉన్న పాత్రలు వస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం ఒక సినిమాలో అత్తగారి పాత్ర ఒకే చేసినట్లు.. త్వరలోనే ఆ సినిమా ప్రారంభం కానుందని తెలిపారు. అత్తాకోడళ్ల నేపథ్యంలో ఒక కామెడీ చిత్రంగా ఇది రాబోతుందని వెల్లడించారు. ఈ క్రమంలోనే రేణు దేశాయ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను కూడా పంచుకున్నారు. ''తనకు ఆధ్యాత్మిక మార్గం అంటే చాలా ఇష్టమని.. భవిష్యత్తులో సన్యాసం తీసుకునే అవకాశం ఉంటుందని'' అన్నారు. డేను దేశాయ్ చేసిన ఈ కామెంట్స్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

'టైగర్ నాగేశ్వరావు' పాత్ర పై విమర్శలు 

అలాగే రేణు దేశాయ్ 'టైగర్ నాగేశ్వరావు' సినిమాలో తాను చేసిన సంఘ సంస్కర్త హేమలతా లవణం పాత్రపై తీవ్ర విమర్శలు ఎదుర్కోవడం గురించి మాట్లాడారు. ఆ రోజు నా గురించి తప్పుగా మాట్లాడిన వారు.. ఆ తర్వాత వచ్చి నాకు క్షమాపణలు చెప్పారు. నాకు నటన అంటే చాలా ఇష్టం 15ఏళ్ళ వయసులోనే ఇండస్ట్రీకి వచ్చాను. చూడడానికి నేను డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చే మనిషిలా కనిపిస్తాను.. కానీ నేను డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వను! అలాంటి వ్యక్తిని అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు సినిమాలు చేస్తూనే ఉండేదాన్ని. ఇప్పటికీ చాలా మంచి పేరు కూడా  వచ్చేది అని అన్నారు రేణు దేశాయ్. 

Also Read: Nari Nari NadumaMurari: మెగాస్టార్ కి పోటీగా సంక్రాంతి బరిలో శర్వా.. నారీ నారీ నడుమ మురారి' నుంచి బిగ్ అప్డేట్!

Advertisment
తాజా కథనాలు