/rtv/media/media_files/2025/10/20/nari-nari-nadumamurari-2025-10-20-17-02-39.jpg)
Nari Nari NadumaMurari
Nari Nari NadumaMurari: రీసెంట్ గా 'మనమే' సినిమాతో అలరించిన హీరో శర్వానంద్.. ఇప్పుడు మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజ్ దర్శకత్వంలో 'నారీ నారీ నడుమ మురారి' చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఈరోజు దీపావళి పండగ సందర్భంగా మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మూవీ విడుదల తేదీని అనౌన్స్ చేశారు.
Team #NariNariNadumaMurari
— AK Entertainments (@AKentsOfficial) October 20, 2025
Wishing you a Happy Diwali 🪔 and Gearing up for the Grand Theatrical Release this Sankranthi 2026! 🎆🔥
Love. Laughter. Lights. And pure magic awaits! 🌟@ImSharwanand@iamsamyuktha_@sakshivaidya99@RamAbbaraju@ItsActorNaresh#YazinNizar… pic.twitter.com/4yLkyooiZ0
సంక్రాంతి బరిలో శర్వా..
2026 సంక్రాంతి కానుకగా విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్', ప్రభాస్ రాజాసాబ్, నవీన్ పోలిశెట్టి 'అననగనగా ఒక రాజు' సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు శర్వానంద్ కూడా సంక్రాంతి బరిలో చేరాడు. నాలుగు సినిమాలు కూడా ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మరి ఇందులో సంక్రాంతి బాక్సాఫీస్ హీరో అయ్యేదెవరో తెలియాలంటే విడుదల వరకు వెయిట్ చేయాల్సిందే.
విడుదల తేదీతో పాటు దీపావళి సందర్భంగా మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో శర్వానంద్ పట్టు పంచె, చొక్కాతో ట్రెడిషనల్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడం సరైన సమయమని భావిస్తున్నారు మేకర్స్.
ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సాక్షి వైద్య, సంయుక్త కథానాయికలుగా నటిస్తున్నారు. విశాల్ చంద్ర శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈమూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. 'ఒకే ఒక జీవితం' సూపర్ హిట్ తర్వాత శర్వానంద్ నటించిన 'మనమే' ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దీంతో ఇప్పుడ రాబోయే చిత్రం 'నారీ నారీ నడుమ మురారి' సక్సెస్ శర్వాకు కీలకంగా మారనుంది.