ప్రియా భవానీ శంకర్. ఈ అందాల తమిళ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. న్యూస్ రీడర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రియా ఆ తర్వాత తమిళ బుల్లితెరపై సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంది. ‘మేయాద మాన్’ తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తర్వాత వరుస హిట్లతో కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది.
ఇక సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన ‘కళ్యాణం కమనీయం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీలో తన అందం, అభినయంతో సినీ ప్రియుల్ని కట్టిపడేసింది. ఆ తర్వాత నాగ చైతన్య ధూత వెబ్ సిరీస్‌లోనూ నటించి అదరగొట్టేసింది. అలాగే ఇటీవల గోపీచంద్ నటించిన ‘భీమా’ సినిమాలో కూడా నటించి మెప్పించింది. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.
ఇది కూడా చదవండి: బిగ్‌బాస్ ఫేం శుభశ్రీ కారుకు యాక్సిడెంట్..
ఇప్పుడు కోలీవుడ్‌లో ఫుల్ బిజీ అయిపోయింది. ఇందులో భాగంగానే స్టార్ హీరో జీవా సరసన హీరోయిన్‌గా ‘బ్లాక్’ మూవీలో నటిస్తుంది. ఈ మూవీ అక్టోబర్ 11న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో పాల్గొంటూ సందడి చేస్తుంది. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియా హీరోయిన్లు స్కిన్ షో చేస్తుండటంపై హాట్ కామెంట్స్ చేశారు.
నా శరీరం ఒక వస్తువు కాదు
తన శరీరం ఒక వస్తువు కాదని తెలిపింది. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి గ్లామర్ షో చేయనని బల్లగుద్ది చెప్పింది. అంతేకాకుండా హీరోయిన్‌గా ఫ్యాషన్ పేరుతో కొన్ని అంశాలను ప్రమోట్ చేయలేనని పేర్కొంది. కెరీర్ పరంగా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ విషయంలోనూ బాధపడకూడదని అనుకుంటానని తెలిపింది.
దీని కారణంగానే ప్రతి విషయాన్ని ఎంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటానని స్పష్టం చేసింది. సినిమాలో ఎలాంటి పాత్ర చేయడానికి అయినా వెనుకాడను.. ఒకవేళ నెగెటివ రోల్స్ వచ్చినా ఎంతో ఇష్టంతో చేస్తానని.. అది తన వృత్తి అని చెప్పారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.