Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగిస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించడం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అత్యంత పవిత్రంగా భావించే లడ్డూలో జంతువుల కొవ్వు కలపడం భక్తులలో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. శ్రీవారి లడ్డూ విషయంలో ఇలా చేసిన నీచులను కఠినంగా శిక్షించాలని భక్తులుతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సైతం ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
లడ్డూ వివాదం పై నటి ప్రణీత ఆగ్రహం
ఈ ఘటన పై తాజాగా టాలీవుడ్ నటి ప్రణీత స్పందించారు. శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలపడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ తయారీలో యానిమల్ ఫ్యాట్ వినియోగిస్తున్నారనే వార్తలు రావడం చాలా బాధాకరం. శ్రీవారి విషయంలో ఇలా జరగడం చాలా దారుణం. వెంకటేశ్వర స్వామి భక్తులు నిజంగా కలలో కూడా ఊహించలేని పరిణామం ఇది. ఇలాంటి పని చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.
ఇది ఇలా ఉంటే లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యి శాంపిల్స్‌ను ల్యాబ్ కు పంపించగా కల్తీ అయినట్లు తేలింది. నాణ్యమైన నెయ్యి ఎస్ వ్యాల్యూ 95.98 నుంచి 104.32 మధ్య ఉండగా.. ఒక శాంపిల్ లోని నెయ్యి వ్యాల్యూ చెక్ చేయగా కేవలం 19.72గా వచ్చింది. మరో రెండు శాంపిల్స్ పరిశీలించగా దాదాపు 20 వరకు ఎస్ వాల్యూ వచ్చింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. అలాంటిది శ్రీవారి ప్రసాదంలో ఈ స్థాయిలో కల్తీ జరగడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: Rahul Gandhi: తిరుపతి లడ్డూ వివాదం పై తీవ్రంగా స్పందించిన రాహుల్ !