Mollywood : హేమ కమిటీ రిపోర్ట్ మలయాళ సినిమా ఇండస్ట్రీలో #MeToo లాంటి ఓ ఉద్యమానికి నాంది పలకడంతో ఎంతో మంది నటీమణులు తమ సమస్యలను బయటకు చెప్పారు. ఈ విషయం తెలిసి మోహన్‌లాల్, మమ్ముట్టి వంటి స్టార్ హీరోలు తమ బాధను వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో మహిళలకు సేఫ్టీ ఉండాలని కోరారు. సమంత కూడా ఈ నివేదికను అభినందించింది. ఈ నివేదికతో మహిళలపై వేధింపులు తగ్గుతాయని అందరూ ఆశించారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ నటి మిను మునీర్ , పాపులర్ సెలబ్రిటీలు ముఖేష్, మణియంపిల్ల రాజు, ఇడవెల బాబు, జయసూర్యపై తీవ్ర ఆరోపణలు చేసింది.
Also Read: యాదగిరిగుట్టపై ఫొటోలు, వీడియోలు నిషేధం: ఈవో
ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని మిను మునీర్ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొంది. 2013లో ఒక సినిమా షూటింగ్ సమయంలో ముఖేష్, జయసూర్య వంటి స్టార్ నటులు తనను లైంగికంగా వేధించారని ఆమె పోస్ట్ లో పేర్కొంది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి మిను మునీర్ తనపై జరిగిన దారుణాన్ని తెలిపింది.
Also Read: బ్రెయిన్ డెడ్ అయిన యువతి చికిత్స పొందుతూ మృతి
బాత్రూమ్ నుంచి బయటకు..
ఆమె మాట్లాడుతూ.. "ఒక సినిమా షూటింగ్ సమయంలో బాత్రూమ్ నుంచి బయటకు వస్తుండగా నటుడు జయసూర్య నన్ను వెనుక నుంచి గట్టిగా పట్టుకున్నాడు. అంతేకాకుండా నా ఇష్టం లేకుండా బలవంతంగా ముద్దు కూడా పెట్టుకున్నాడు. దీంతో నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. వెంటనే నేను అక్కడి నుంచి పరుగు తీశాను." అని చెప్పుకొచ్చింది.
Also Read: నస్రల్లా వారసుడు హషేమ్ సఫీద్దీన్ మృతి!
మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్న ఇడవేల బాబుపై కూడా మిను ఆరోపణలు చేసింది. "ఆ అసోసియేషన్‌లో జాయిన్ అవ్వాలని చెప్పి తనని ఇంటికి పిలిచినట్లు చెప్పింది. మెంబర్‌షిప్ కోసం అప్లై చేయడానికి సహాయం చేస్తానన్నాడు. కానీ ఇంటికి వెళ్లాక ఆయన నన్ను అభ్యకరంగా తాకడం మొదలు పెట్టాడు అంటూ ఆమె చెప్పింది. అలాగే ముఖేష్ కమిట్‌మెంట్ అడిగితే తిరస్కరించానని,దాని వల్ల అసోసియేషన్‌లో తనకు మెంబర్‌షిప్ ఇవ్వడానికి నిరాకరించాడని ఆమె షాకింగ్ కామెంట్లు చేసింది.
Also Read: వన్యప్రాణులను వేటాడేవారిపై కఠినంగా వ్యవహరించాలి
ఈ సంఘటనల తర్వాత తాను చెన్నై వెళ్లిపోయినట్లు మిను తెలిపింది. “నాకు జరిగిన దారుణాలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. వారి దుష్ప్రవర్తనకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి మీ సహాయం అవసరం” అని ఆమె ఫేసుబుక్ లో రాసుకొచ్చింది.