Actress Malavika Mohanan latest Interview : మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ ఇటీవలే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సిద్దాంత్ చతుర్వేదితో కలిసి 'యుధ్రా' అనే సినిమాలో నటించింది. ఈ మూవీలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక.. సౌత్ సినీ ఇండస్ట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
దక్షిణాది చిత్రసీమలో హీరోలకు ఇచ్చినంత ప్రాధాన్యత నాయికలకు ఇవ్వరని, ఏ విషయంలోనూ పెద్దగా పట్టించుకోరని చెప్పింది. దీంతో ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఈ మేరకు ఆ ఇంటర్వ్యూలో మాళవిక సౌత్ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ.." దక్షిణాదిలో హీరో కేంద్రంగానే సినిమాకు సంబంధించిన అన్ని వ్యవహారాలు జరుగుతాయి. కథానాయికలకు చాలా తక్కువ ప్రాధాన్యతనిస్తారు.
ఆ క్రెడిట్ హీరోకేనా?
సినిమా సక్సెస్ అయితే ఆ క్రెడిట్ మొత్తం హీరోకే ఆపాదిస్తారు. ఒకవేళ పరాజయం పాలైతే అందులో నటించిన హీరోయిన్‌ను అన్‌లక్కీ అని, ఆమె వల్లే సినిమా ఫ్లాప్ అయిందని మాట్లాడతారు.." అని చెప్పుకొచ్చింది. 'మాస్టర్' సినిమాతో సౌత్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు చేసి మంచిగుర్తింపు తెచ్చుకుంది.
Also Read : ప్లాప్ తో ఉన్న డైరెక్టర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తే హిట్ గ్యారెంటీ.. ఇదిగో ప్రూఫ్
రీసెంట్ గా చియాన్ విక్రమ్ 'తంగలాన్' మూవీలో డిఫరెంట్ రోల్ లో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా హీరో ప్రభాస్ సరసన 'రాజాసాబ్' సినిమాలో నటిస్తోంది. ఈ మూవీతోనే ఆమె టాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ మరో కథానాయికగా కనిపించనుంది. ప్రెజెంట్ షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.