నటి కస్తూరికి హైకోర్టు షాక్.. ఇక కష్టమే..!

నటి కస్తూరికి మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. తెలుగు మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయగా ఆమెపై కేసు నమోదైంది. అయితే ఈ కేసులో కస్తూరి ముందస్తు బెయిల్‌ కోరుతూ పిటీషన్ దాఖలు చేయగా.. ధర్మాసనం బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. బెయిల్ పిటీషన్ కొట్టివేసింది.

New Update

ముందస్తు బెయిల్ పిటీషన్ కొట్టివేత 

అయితే ఈ కేసులో నటి కస్తూరి ముందస్తుకు బెయిల్ కోరుతూ చెన్నై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయగా.. ధర్మాసనం ఆమెకు షాకిచ్చింది. 
మంగళవారం జస్టిస్‌ ఆనంద్‌ వెంకటేశ్‌ ముందు ఈ పిటిషన్‌  విచారణకు రాగా.. న్యాయవాదులు  ఆమెకు ముందస్తు బెయిల్‌ ఇవ్వకూడదని వాదించారు. ఆ తర్వాత గురువారం మళ్లీ విచారణకు రాగా ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేస్తున్నట్లు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ముందస్తు బెయిల్ పిటీషన్ ను ధర్మాసనం కొట్టివేసింది. ప్రస్తుతం కస్తూరి కోసం రెండు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.. ఏ క్షణంలోనైనా ఆమె అరెస్టు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read: HBD Kamal Haasan: కమల్ హాసన్ కు మాత్రమే సాధ్యమైన ఈ రికార్డుల గురించి తెలుసా?

ప్రసంగంలో వేదిక పై  కస్తూరి మాట్లాడుతూ.. 300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు  తెలుగు వారు తమిళనాడుకు వచ్చారని.. అలా వచ్చిన వారు ఇప్పుడు తమిళులుగా చలామణి అవుతూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు అంటూ కామెంట్‌ చేసింది. 

క్షమాపణలు 

కస్తూరి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్టు లేఖను విడుదల చేసింది. తాను తెలుగు ప్రజల గురించి తప్పుగా మాట్లాడలేదని  క్లారిటీ ఇచ్చింది. " నేను కుల, ప్రాంతీయ భేదాలకు అతీతంగా జీవించాను. నేను నిజమైన జాతీయవాదిని.  తెలుగు ప్రజలు నాకు పేరుతో పాటు ప్రేమ, కీర్తిని అందించారు. కొందరి వ్యక్తుల గురించి మాత్రమే నేను మాట్లాడానని గ్రహించగలరు. తెలుగు సమాజం మొత్తాన్ని ఉద్దేశిస్తూ నేను మాట్లాడలేదు. నా తెలుగు కుటుంబాన్ని నా ఉద్దేశం కాదు..అనుకోని సంఘటనకు నన్ను క్షమించండి.." అంటూ లేఖలో రాసింది. అయినప్పటికీ ఆమె వ్యాఖ్యలను పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు