Gayathri Gupta: మా నాన్నే నాకు నరకం చూపించాడు.. కాస్టింగ్ కౌచ్ పై 'ఫిదా' నటి సంచలనం!

'మా నాన్న నాకు నరకం చూపించాడు! కరెంటు వైర్ తో కొట్టి.. ఆ గాయాలపై కారం పోసి చిత్రహింసలకు గురిచేశాడు. తండ్రి అంటేనే అహస్యం వేస్తుంది'' అంటూ ఫిదా నటి గాయత్రీ గుప్తా వ్యాఖ్యలు నెట్టింట సంచలనంగా మారాయి.

New Update
Gayathri Gupta

Gayathri Gupta

Gayathri Gupta:  ''మా నాన్న నాకు నరకం చూపించాడు! కరెంటు వైర్ తో కొట్టి.. ఆ గాయాలపై కారం పోసి చిత్రహింసలకు గురిచేశాడు. తండ్రి అంటేనే అహస్యం వేస్తుంది'' అంటూ ఫిదా నటి గాయత్రీ గుప్తా వ్యాఖ్యలు నెట్టింట సంచలనంగా మారాయి. 'ఫిదా'  సినిమాలో సాయి పల్లవి ఫ్రెండ్ క్యారెక్ట్ తో మంచి పేరు తెచ్చుకుంది గాయత్రీ.  అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన వ్యక్తిగత జీవితం, సినీ పరిశ్రమలో తనకు ఎదురైనా అనుభవాల గురించి పలు షాకింగ్ విషయాలను వెల్లడించింది. 

గాయాలపై కారంపొడి

గాయత్రీ వ్యక్తిగత జీవితంలో తాను ఎదుర్కున్న కష్టాల గురించి మాట్లాడుతూ.. బాల్యం తనకు అంత ఈజీగా లేదని.. చాలా కష్టంగా గడిచిందని చెప్పింది. కన్న తండ్రే తనను, తన తల్లిని చిత్రహింసలకు గురిచేసేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. కరెంటు వైర్ తో కొట్టి.. ఆ గాయాలపై కారంపొడి చల్లేవాడని, కళ్ళల్లో నిమ్మరసం పిండేవాడని తెలిపింది. సాధారణంగా అమ్మాయిలంతా తమ తండ్రిలాంటి భర్త రావాలని కోరుకుంటాడు.. కానీ తనకు మాత్రం తండ్రి అంటేనే అసహ్యం వేస్తుందని తెలిపింది. 

నేక సార్లు లైంగిక దాడి

అలాగే సినీ పరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాలను కూడా గుర్తు చేసుకుంది గాయత్రీ గుప్తా. ఇండస్ట్రీలో తానూ కూడా కాస్టింగ్ కౌచ్ కి గురైనట్లు తెలిపింది. అవకాశాలు కోసం వెళ్ళినప్పుడు కమిట్మెంట్ అడిగేవారిని చెప్పింది. ఇండస్ట్రీలోకి వచ్చిన  తర్వాత తన అనుమతి లేకుండా  తనపై అనేక సార్లు  లైంగిక దాడి  జరిగినట్లు కూడా తెలిపింది. ఒక సారి సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత.. టీమ్ అంతా కలిసి ఒక పార్టీలో డ్రింక్ చేశాము. అప్పుడు ఓ నిర్మాత, ఓ డైరెక్టర్ డ్రాప్ చేస్తామంటూ ఇంటికి తీసుకెళ్లి తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని వెల్లడించింది. ఆ సమయంలో తన డ్రెస్సే తనను కాపాడిందని తెలిపింది. ఎంత లాగిన డ్రెస్ రాకపోవడంతో.. వాళ్ళు నన్ను వదిలేసి వెళ్లిపోయారని చెప్పింది. 

షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ మొదలు పెట్టిన గాయత్రీ గుప్తా.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 'పెళ్లికి ముందు' అనే షార్ట్ ఫిలిం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 2014 లో  'ఐస్ క్రీమ్ 2' సినిమాతో సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఫిదా సినిమాలో సాయి పల్లవి ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించి మంచి గుర్తింపు పొందింది. తెలంగాణ యాసలో ఆమె చెప్పిన డైలాగులు ఆకట్టుకున్నాయి.  'జంధ్యాల రాసిన ప్రేమకథ', 'మిఠాయి', 'అమర్ అక్బర్ ఆంటోని', 'బుర్రకథ',  'కొబ్బరి మట్ట' పలు సినిమాల్లో మెరిసింది.  

అయితే గాయత్రికి  బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొనే అవకాశం కూడా వచ్చిందట. కానీ బిగ్ బాస్ టీమ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇబ్బందికరమైన ప్రశ్నలు అడగడంతో ఆ షోలో పాల్గొనలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. 

Also Read:బాహుబలి: ది ఎపిక్ రన్‌టైం‌పై రానా షాకింగ్ కామెంట్స్.. జక్కన్న ప్లాన్ మాములుగా లేదుగా!

Advertisment
తాజా కథనాలు