Shwetha Menon : బూతు సినిమాలు చేస్తుందని కేసు పెట్టారు.. రతి నిర్వేదం నటికి బిగ్ షాక్!

మలయాళ నటి శ్వేతా మీనన్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆమెపై కొచ్చి పోలీసులు కేసు నమోదు చేశారు. అసభ్యకరమైన కంటెంట్‌తో కూడిన సినిమాలు, ప్రకటనల్లో నటించి ఆర్థిక లబ్ధి పొందుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెపై  ఈ కేసు నమోదైంది.

New Update
shwetha meenon

మలయాళ నటి శ్వేతా మీనన్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆమెపై కొచ్చి పోలీసులు కేసు నమోదు చేశారు. అసభ్యకరమైన కంటెంట్‌తో కూడిన సినిమాలు, ప్రకటనల్లో నటించి ఆర్థిక లబ్ధి పొందుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెపై  ఈ కేసు నమోదైంది. కొచ్చిలోని ఓ సామాజిక కార్యకర్త మార్టిన్ మేనచెరి ఈ మేరకు ఎర్నాకులం కోర్టులో ఫిర్యాదు చేయగా, కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆమె నటించిన సినిమాలు,  యాడ్స్ సోషల్‌ మీడియాలో ప్రసారం కావడంపై కొన్ని రోజుల క్రితం ఆయన పోలీసులు ఫిర్యాదు చేయగా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆయన ఎర్నాకులం  కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు బుక్ చేశారు. 

డబ్బు కోసం ఇలాంటి సినిమాలు

ఆయన తన ఫిర్యాదులో రతి నిర్వేదం, పలేరి మాణిక్యం, కాళిమన్ను వంటి చిత్రాల్లోని కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను, అలాగే ఆమె నటించిన ఒక కండోమ్ ప్రకటనను ప్రస్తావించారు. శ్వేతా మీనన్ డబ్బు కోసం ఇలాంటి అశ్లీల చిత్రాల్లో నటిస్తున్నారని, సోషల్ మీడియా, అడల్ట్ సైట్లలో కూడా అలాంటి కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో వెల్లడించారు. 

ప్రస్తుతం ఆమె అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (AMMA) అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే కొన్ని సంవత్సరాల క్రితం నటించిన చిత్రాల ఆధారంగా ఇప్పుడు కేసు పెట్టడం వెనుక ఇతర కారణాలు ఉండొచ్చని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించారు. 

తెలుగులో రాజన్న సినిమాతో  

శ్వేతా మీనన్ తన కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించారు. 1994లో ఫెమినా మిస్ ఇండియా ఆసియా పసిఫిక్ టైటిల్ గెలుచుకున్నారు. అదే సంవత్సరం మిస్ ఇండియా పోటీలలో మూడవ రన్నరప్‌గా నిలిచారు. 1991లో మలయాళ చిత్రం అనస్వరంతో సినీరంగ ప్రవేశం చేసినప్పటికీ, ఆ తర్వాత ఆమె బాలీవుడ్‌పై దృష్టి సారించారు. అక్కడ పలు చిత్రాలలో నటించారు, అందులో ఇష్క్, బంధన్, హంగామా వంటివి ముఖ్యమైనవి.  తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించారు. నాగార్జున హీరోగా వచ్చిన 'రాజన్న' చిత్రంలో ఆమె ఒక ప్రత్యేక పాత్రలో కనిపించారు. శ్వేతా మీనన్ నటించిన కాళిమన్ను చిత్రం చాలా వివాదాస్పదమైంది. ఈ సినిమాలో ఆమె నిజమైన ప్రసవ సన్నివేశాలను చిత్రీకరించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. చాలా మంది దీనిని విమర్శించారు, కానీ శ్వేతా మీనన్ మాత్రం సినిమా కోసం తాను చేసిన ప్రయత్నంగా పేర్కొన్నారు. శ్వేతా మీనన్ 2011లో శ్రీవల్సన్ మీనన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది.

Advertisment
తాజా కథనాలు