Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు మరోసారి చంపేస్తాం అంటూ బెదిరింపులు వచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ ముంబయి ట్రాఫిక్ పోలీసుల వాట్సప్ నంబర్‌కు సందేశం వచ్చింది. ఒక వేళ ఆ మొత్తాన్ని సల్మాన్ చెల్లించకపోతే మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ కంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఈ సందేశంపై విచారణ చేస్తున్నట్లు ముంబయి పోలీసులు చెప్పారు.
ఇది కూడా చదవండి: హరీష్ రావు బంధువులపై కేసు నమోదు!
ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో కడియం లొల్లి.. తలపట్టుకున్న పెద్దలు!
ఇటీవల సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు...
ఇటీవల సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరగడం కలకలం రేపింది. నిందితుడు లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్ సబర్మతి జైలులో ఉన్నారు. ఈ ఏడాది బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇంటిపై కాల్పులు జరిపిన కేసులోనూ లారెన్స్ బిష్ణోయ్ పేరు తెరపైకి వచ్చింది. ముంబై పోలీసులు బిష్ణోయ్ కస్టడీ కోసం అనేక సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ సక్సెస్ కాలేకపోయారు.
2023లో ఢిల్లీ తిహార్ జైలు నుంచి బిష్ణోయ్‌ని సబర్మతి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ పేరు మోసిన గ్యాంగ్‌స్టర్‌పై ఇప్పటికే డిజన్ల కొద్ది కేసులు నమోదయ్యాయి. 2022లో పంజాబీ ఫేమస్ సింగర్ సిద్దూ మూసేవాలాను అత్యంత దారుణంగా కాల్చి చంపింది ఈ ముఠా.
ఇది కూడా చదవండి: విచారణకు రమ్మన్నారు.. సజ్జల అరెస్ట్ తప్పదా?
సల్మానే టార్గెట్ ఎందుకు?..
బిష్ణోయ్ సామాజిక వర్గం ఆరాధించే రెండు కృష్ణ జింకలను వేటాడి చంపినప్పటి నుంచి సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేసుకుంది బిష్ణోయి గ్యాంగ్. దీని కారణంగానే ఆ గ్యాంగ్ సల్మాన్‌ను హతమార్చేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఇటీవల ఏప్రిల్‌లో ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్‌పై వచ్చి ముంబైలోని సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపారు.
తాజాగా బాబా సిద్దిఖి హత్య వెనుక కూడా ఇదే కారణం ఉందని అనుమానిస్తున్నారు. సల్మాన్‌ఖాన్‌తో సన్నిహిత సంబంధాలు ఉండడంవల్లే సిద్దిఖీని ఈ గ్యాంగ్ హత్య చేసినట్లు తెలుస్తోంది. ఇక సల్మాన్ ఖాన్‌కు సపోర్ట్ చేసే ఎవరికైనా ఇదే గతి పడుతుందని బిష్ణోయ్ గ్యాంగ్ ఓ సోషల్‌మీడియా పోస్టు పెట్టింది.