'గర్ల్‌ఫ్రెండ్' ని పరిచయం చేయబోతున్న విజయ్ దేవరకొండ.. పోస్టర్ వైరల్!

రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ది గర్ల్ ఫ్రెండ్'. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 'ది గర్ల్ ఫ్రెండ్' టీజర్ ను రౌడీ హీరో విజయ్ దేవరకొండ డిసెంబర్ 9న లాంచ్ చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.

New Update

The GIRLFRIEND Teaser: నేషనల్ క్రష్ రష్మిక మందన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రంలో రష్మిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. శ్రీవల్లి పాత్రలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.  ఈ సినిమాతో రష్మిక క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్, బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. వాటిలో ఒకటి 'ది గర్ల్ ఫ్రెండ్'. రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో లీడ్ రోల్లో నటిస్తోంది. 

 'ది గర్ల్ ఫ్రెండ్' టీజర్ లాంచ్.. 

అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా..  తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.  'ది గర్ల్ ఫ్రెండ్' టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ టీజర్ ను లాంచ్ చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. 11.07 నిమిషాలకు టీజర్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. 

కుబేర.. 

ఈ సినిమాతో పాటు రష్మిక  శేఖర్ కముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కుబేర' మూవీలో ఫీమేల్ లీడ్ గా నటిస్తోంది.  ఈ సినిమాలో  కోలీవుడ్ స్టార్ ధనుష్, అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే  ఈ సినిమా నుంచి రష్మిక రష్మిక ఫస్ట్ లుక్  గ్లిమ్ప్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో రష్మిక నిర్మానుష్యమైన ఒక అడవి ప్రాంతాల్లోకి వెళ్లి గుంతలో పూడ్చిపెట్టిన ట్రాలీ బ్యాగ్‌ను బయటకు తీస్తున్న విజువల్స్ చూపించారు. ఆ బ్యాగ్ అంతా డబ్బుతో నిండి ఉంటుంది. అసలు రష్మిక ఆ డబ్బుల సూట్ కేస్ ఎందుకు పూడ్చి పెట్టింది..? ఆ డబ్బును ఎక్కడికి తీసుకెళ్లింది అనే అంశాలతో సస్పెన్స్‌ నెలకొంది.

Also Read: ఇదెక్కడి వింతరా బాబు.. బంగారు నగలతో పిల్లికి శ్రీమంతం.. మామూలుగా లేదుగా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు