Actor Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ఏకైక కుమార్తె గాయత్రి గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం ఛాతీలో నొప్పిగా ఉందనడంతో హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి వెంటనే తరలించారు.. అక్కడ చికిత్సపొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. రాజేంద్రప్రసాద్‌కు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.
రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రిది ప్రేమ పెళ్లి. ఈ విషయాన్ని రాజేంద్ర ప్రసాదే స్వయంగా ఓ కార్యక్రమంలో ప్రస్తావించారు. ప్రేమ వివాహం చేసుకున్న తరువాత కుమార్తెతో మాటలు లేవని ఆయన తెలిపారు.
Also Read : హర్యానాలో ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..