/rtv/media/media_files/2025/10/29/mass-jathara-2025-10-29-09-24-40.jpg)
Mass Jathara
Mass Jathara: మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) హీరోగా నటించిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ “మాస్ జాతర” విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ రచయితగా పేరు తెచ్చుకున్న భాను భోగవరపు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా అక్టోబర్ 31న పైడ్ ప్రీమియర్స్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. హైదరాబాద్‌లో ఇటీవల ఈ సినిమాకి సంబంధించి జరిగిన గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నటీనటులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్(Rajendra Prasad) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆయన మాట్లాడుతూ - “మాస్ జాతర ప్రేక్షకులను షాక్ చేయకపోతే నేను సినీ పరిశ్రమను వదిలేస్తాను” అంటూ ధైర్యంగా ప్రకటించారు.
Also Read: 'బాహుబలి: ది ఎపిక్' తుఫాన్.. యూట్యూబ్ ను షేక్ చేస్తున్న కొత్త ట్రైలర్..
Rajendra Prasad Speech Mass Jathara
Mass Jathara Movie Chusi మీరు shock అవ్వకపోతే నేను INDUSTRY నుంచి వెళ్లిపోతాను
— Milagro Movies (@MilagroMovies) October 28, 2025
:- Actor #RajendraPrasad#MassJathara#Ravitejapic.twitter.com/NJbfZYM1vO
రాజేంద్రప్రసాద్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన మాటలతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. గతంలో కూడా కొంతమంది నటులు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే, కొందరు సినీ విశ్లేషకులు మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు సినిమాకు ఉత్సాహాన్ని పెంచినా, కొన్నిసార్లు ప్రతికూల ప్రభావం చూపవచ్చని అభిప్రాయపడుతున్నారు.
Also Read: సూపర్ స్టార్ రజినీకాంత్ సంచలన నిర్ణయం!
సినిమా విషయానికొస్తే..
‘మాస్ జాతర’ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. నిర్మాతలు నాగ వంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందించగా, ఆయన ఇచ్చిన పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి.
ఈ సినిమా మాస్ యాక్షన్, ఎమోషనల్ డ్రామా, ఫ్యామిలీ ఎంటర్టైన్‌మెంట్ అంశాలతో కూడిన ప్యాకేజీగా రూపొందిందని చిత్రబృందం చెబుతోంది. రవితేజ ఎనర్జీ, శ్రీలీల గ్లామర్, రాజేంద్రప్రసాద్ పాత్ర సినిమాకు ప్రత్యేక హైలైట్‌గా నిలుస్తాయట.
మొత్తానికి, “మాస్ జాతర” సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో మరింత ఉత్సుకత రేకెత్తించాయి. ఇప్పుడు అందరి దృష్టి అక్టోబర్ 31న విడుదల కానున్న ఈ చిత్రంపై పడింది, నిజంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందా లేదా అన్నది చూడాల్సిందే.
Follow Us