Kiccha Sudeep: హీరో కిచ్చా సుదీప్ ఇంట విషాదం.. పవన్ కళ్యాణ్ ట్వీట్

కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి సరోజ సంజీవ్ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

kichha sudeep

kichha sudeep

New Update

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి సరోజినీ సందీప్ జయనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియల కోసం సరోజ భౌతికకాయాన్ని JP నగర్‌లోని కుటుంబ సభ్యులు తమ నివాసానికి  తీసుకురానున్నారు.  

Also Read: Married Couples : కొత్తగా పెళ్లయిందా? ఈ మూడు పాటిస్తే మీ భార్య మిమల్ని ఎప్పటికీ వదలదు!

తల్లి అంటే అమితమైన ఇష్టం 

సుదీప్ తన తల్లిదండ్రులతో తనకున్న సన్నిహిత బంధం గురించి తరచూ మాట్లాడుతుంటారు. ఇప్పటికీ ఆయన తన తల్లితోనే కలిసి ఉండేవారు.  ఇప్పుడు అతని తల్లి మరణంతో సుదీప్ అతని కుటుంబ సభ్యులు  శోకసంద్రంలో మునిగిపోయారు. కిచ్చా సుదీప్ మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యంమత్రి పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కిచ్చా సుదీప్ మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యంమత్రి పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రముఖ నటుడు  కిచ్చా సుదీప్ తల్లి సరోజ కన్నుమూశారని తెలిసి చాలా చింతించాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.  తన నట జీవితంపై తల్లి ప్రభావం, ప్రోత్సాహం ఉందని  సుదీప్ చాలా సందర్భాల్లో తెలిపారు. ఈ బాధ నుంచి ఆయన త్వరగా కోలుకోవాలి. సుదీప్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్ పవన్ ట్వీట్ చేశారు.

Also Read: సాయి పల్లవి అలా అనడంతో మనసు ముక్కలైంది.. శివ కార్తికేయన్ మాటలు వింటే షాక్

కిచ్చా సుదీప్ సినిమాలు

కిచ్చా సుదీప్ సినిమాల విషయానికి వస్తే.. 2022లో విక్రాంత్ రోనా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్  'మ్యాక్స్' సినిమా చేస్తున్నాడు. సినిమాలతో పాటు సుదీప్ కన్నడ బిగ్ బాస్ హోస్టుగా వ్యవహరిస్తున్నారు. తెలుగులో సుదీప్ 'ఈగ' బాగా పాపులర్ అయ్యారు. 

Also Read: మిస్ ఇండియా నిఖితకు ఆ డైరెక్టర్ తో వర్క్ చేయాలని ఉందట.. ?

Also Read: లిఫ్ట్ లో నాగచైతన్య, శోభిత ఏం చేశారో చూడండి! వైరలవుతున్న చై ఇన్‌స్టా పోస్ట్

#kiccha-sudeep #kannada-actor
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe