/rtv/media/media_files/2025/04/09/pAH9AOoZ6ftVzTnSpzc7.jpg)
Abki Baar Arjun Sarkaar Lyrical song released Photograph: (Abki Baar Arjun Sarkaar Lyrical song released)
నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న కొత్త చిత్రం ‘హిట్-3’. శైలేష్ కొలను డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్‌లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే మోస్ట్ పవర్ ఫుల్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో అర్జున్ సర్కార్‌గా నటిస్తున్న నాని లుక్‌కు అభిమానులు ఫిదా అయిపోయారు.
దర్శకుడు శైలేష్ కొలను ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. హిట్ ఫ్రాంచైజీలో ఇప్పటి వరకు వచ్చిన హిట్ 1, హిట్ 2 చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాయి. మొదటి పార్ట్‌లో విశ్వక్ సేన్ నటించగా.. సెకండ్ పార్ట్‌లో అడవి శేష్ నటించాడు. ఇప్పుడు మూడో పార్ట్‌లో నేచురల్ స్టార్ నాని నటిస్తున్నాడు.
రెండో సాంగ్ రిలీజ్
తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. ఈ సినిమాలోని సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. నాని క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ.. అబ్ కీ బార్ అర్జున్ సర్కార్ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అందులో నాని పవర్ ఫుల్ లుక్ అదిరిపోయింది.
ఈ సాంగ్ ‘‘వేటు వేసినా.. గీత రాసినా.. కోత మారు’’ అంటూ సాగుతుంది. ప్రస్తుతం ఇది అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్‌తో పాటు మేకర్స్ మరో అప్డేట్ అందించారు. ఈ సాంగ్‌లోనే ట్రైలర్ డేట్ ను ఇచ్చేశారు. ఏప్రిల్ 14న ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం మే 1న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది.