Ananthika: అనంతిక సనీల్ కుమార్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరు తెగ వైరల్ అవుతోంది. ఇటీవలే విడుదలైన 8 వసంతాలు ట్రైలర్( 8 vasantalu trailer) తో ఈ యంగ్ బ్యూటీ ఒక్కరిగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. 19 ఏళ్లకే నటనతో వివిధ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అసలు ఈ అనంతిక అనంతిక సనీల్ కుమార్ ఎవరూ?
/filters:format(webp)/rtv/media/media_files/2025/06/18/ananthika -9df8cf78.png)
బహుముఖ ప్రజ్ఞాశాలి
అనంతిక కేరళలోని తిరువనంతపురంలో పుట్టి పెరిగింది. అనంతిక కేవలం నటి మాత్రమే కాదు, పలు కళల్లో ఆమెకు ప్రావీణ్యం ఉంది. క్లాసికల్ డ్యాన్స్ , కరాటే, కళరిపయట్టు, కత్తిసాము వంటి విద్యల్లో నైపుణ్యం పొందింది. రళ సంప్రదాయ వాయిద్యమైన చెండా (డ్రమ్స్) వాయించడంలో కూడా ఆమెకు పట్టు ఉంది. ఇటీవలే '8 వసంతాలు' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తన కళరిపయట్టు, డ్యాన్స్, చెండా వాయించే ప్రతిభను ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇవి మాత్రమే కాదు అనంతిక ఓవైపు నటిగా కెరీర్ కొనసాగిస్తూనే.. మరోపక్క 'లా' కోర్సు చదువుతోంది.
Actress Ananthika Sanilkumar shows her range of dances while performing a medley including Sankarabharanam title song#8Vasantalu pre release function pic.twitter.com/fdwOQjIW2J
— idlebrain.com (@idlebraindotcom) June 17, 2025
సినిమాలు
అనంతిక మ్యాడ్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇందులో జెన్నీ పాత్రలో నటించి, తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. 2015లోనే సినీ కెరీర్ మొదలు పెట్టిన అనంతిక 'మిలీ', 'రైడ్', రజనీకాంత్ 'లాల్ సలాం' వంటి తమిళ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులో సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తెలుగులో అనంతిక లేటెస్ట్ ఫిల్మ్ '8 వసంతాలు' జూన్ 20న విడుదల కానుంది. ఇప్పటికే ఈమూవీ ట్రైలర్ విడుదలవగా.. మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
/filters:format(webp)/rtv/media/media_files/2025/06/18/Ananthika Sanilkumar-a98f18f3.png)
Also Read: Actress Kajol: రామోజీ ఫిల్మ్ సిటీ భయంకరమైన ప్రదేశం: బాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్