National Awards 2025: 100 పైగా సినిమాలు 33 ఏళ్ళ సినీ కెరీర్ లో పద్మశ్రీ తో సహా ఎన్నో అవార్డులను అందుకున్న షారుక్ ఖాన్ ని తొలిసారి నేషనల్ అవార్డు వరించడం విశేషంగా మారింది. తాజాగా ప్రకటించిన 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో షారుఖ్ 'జవాన్' సినిమాకు గానూ ఉత్తమ జాతీయ నటుడు పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. మొదటిసారి నేషనల్ అవార్డు అందుకోవడంపై షారుక్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేస్తూ చిత్రబృందానికి, అవార్డు జ్యురీకి, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియోలో షారుక్ మాట్లాడుతూ.. నేను ఎంతో కృతజ్ఞతతో నిడిపోయాను! నేషనల్ అవార్డుతో గౌరవించబడడం నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణం. అవార్డు జ్యురీ సభ్యులకు, ఛైర్మెన్ కి, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మినిస్ట్రీకి అలాగే ఈ గౌరవానికి నేను అర్హుడనని భావించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలిపారు.
Thank you for honouring me with the National Award. Thanks to the jury, the I&B ministry… Iss samman ke liye Bharat Sarkar ka dhanyawaad. Overwhelmed with the love showered upon me. Half a hug to everyone today…. pic.twitter.com/PDiAG9uuzo
— Shah Rukh Khan (@iamsrk) August 1, 2025
అందరికీ ధన్యవాదాలు!
షారుక్ ఇంకా మాట్లాడుతూ.. నా దర్శకులకు, రచయితలందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా 2023కి సంబంధించిన డైరెక్టర్ అట్లీ, రాజ్, సిద్ అండ్ అతని బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. 'జవాన్' సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు, అలాగే ఈ అవార్డు వచ్చేలా నేను నటించగలనని నమ్మినందుకు థ్యాంక్యూ. అట్లీ మీరు అన్నట్లుగానే ఇది మాస్! అంటూ అవార్డు పట్ల ఆనందాన్ని పంచుకున్నారు షారుక్. తనతో పాటు అలసిపోకుండా పనిచేసే బృందానికి, మేనేజ్మెంట్ కి కూడా ధన్యవాదాలు తెలిపారు.
ఇక చివరిగా షారుక్ తన కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుతూ.. వారి పట్టుదల, ప్రేమ లేకుండా ఈ అవార్డు అసాధ్యమని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా తన భార్య, పిల్లలు తనను ఒక చిన్న పిల్లవాడిలా చూసుకుంటూ, తపట్ల ఎంతో ప్రేమ, శ్రద్ధను చూపించారని తెలిపారు. సినిమా పట్ల నాకున్న పిచ్చి.. వారి నుంచి నన్ను దూరం చేస్తుందని వారికి తెలుసు! అయినప్పటికీ వారంతా దానిని నవ్వుతూ భరిస్తూ, ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉంటారని కృతజ్ఞతలు తెలిపారు.
జవాన్ సినిమా
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ 'జవాన్' సినిమాకు దర్శకత్వం వహించారు. 2023లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1,148 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది ఆ ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో విభిన్న గెటప్స్ లో షారుక్ యాక్షన్ సన్నివేశాలు, నటన ప్రేక్షకులను మెప్పించాయి. షారుఖ్ ఖాన్ సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్ ఈ సినిమాను నిర్మించింది. ఇందులో నయనతార ఫీమేల్ లీడ్ గా నటించగా.. విజయ్ సేతుపతి, సన్యామల్హోత్రా, సునీల్ గ్రోవర్, ప్రియమణి, యోగిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
Also Read: 71th National Film Award: ఊరూ పల్లెటూరు.. 'బలగం' పాటకు జాతీయ అవార్డు తెచ్చిన లిరిక్స్ ఇవే !