Cine Lovers Day : సినీ ప్రేమికులకు పండగ రోజు.. మల్టీప్లెక్స్ ల్లో 99 రూపాయలకే సినిమా! 

ఈరోజు సినీ ప్రేమికుల దినోత్సవం. మల్టీప్లెక్స్‌లలో ఈరోజు (మే 31) టికెట్ రేట్ 99 రూపాయలు మాత్రమే. మల్టీప్లెక్స్‌లకు ప్రేక్షకులను ఆకర్షించడం కోసం మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ ఆఫర్ అందిస్తోంది. ఆలస్యమెందుకు సరదాగా మంచి సినిమా చూసి వచ్చేయండి. 

New Update
Cine Lovers Day : సినీ ప్రేమికులకు పండగ రోజు.. మల్టీప్లెక్స్ ల్లో 99 రూపాయలకే సినిమా! 

Cine Lovers Day Today :  ప్రతి సంవత్సరం 'సినిమా ప్రేమికుల దినోత్సవం' (Cine Lovers Day) జరుపుకుంటారు. మే 31వ తేదీ శుక్రవారం సినీ ప్రేమికులకు ప్రత్యేకం. భారతదేశంలోని చాలా మల్టీప్లెక్స్‌లలో, మే 31న ఏ సినిమా చూసినా టిక్కెట్ ధర 99 రూపాయలు మాత్రమే. ఈ మేరకు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది. PVR Inox, Cinepolis మొదలైన మల్టీప్లెక్స్‌ (Multiplex) లలో ఈ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ వారం (మే 31) విడుదలవుతున్న సినిమాలను చూసే ప్రేక్షకులు ఈ ఆఫర్‌తోపండగ చేసుకోవచ్చు. 

Cine Lovers Day :  ఈ మధ్య కాలంలో సినిమాకు వచ్చి సినిమాలు చూసే వారి సంఖ్య తక్కువ. టిక్కెట్ల ధర ఎక్కువగా ఉండటమే ప్రధాన కారణాలలో ఒకటి. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లలో అన్ని సినిమాల టిక్కెట్ ధర ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేక రోజుల్లో కేవలం 99 రూపాయలకే సినిమా టిక్కెట్లు అమ్ముడుపోతే ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో సినిమా చూసేందుకు వస్తారు. అందుకోసం 'సినిమా ప్రేమికుల దినోత్సవం' జరుపుకుంటారు.

Also Read: ట్రెండ్ సెట్టింగ్ సూపర్ స్టార్.. జనం మెచ్చిన నటశేఖరుడు కృష్ణ!

క‌రోనా వైర‌స్ (Corona Virus) ప్రారంభ‌మైన త‌ర్వాత మ‌ల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌కు వ‌చ్చి సినిమాలు చూసే వారి సంఖ్య బాగా త‌గ్గింది. మళ్లీ ప్రేక్షకులను ఆకర్షించేందుకు మల్టీప్లెక్స్‌లు కొత్త వ్యూహాన్ని రూపొందించాయి. 'సినిమా ప్రేమికుల దినోత్సవం' పేరుతో ఆఫర్ ధరకే టిక్కెట్లు అందజేసి జనాలను ఆకర్షించారు. ఈ ఏడాది మే 31న 'సినిమా ప్రేమికుల దినోత్సవం' జరుపుకుంటున్నారు.

Cine Lovers Day:  పీవీఆర్ ఐనాక్స్, సినీపోలిస్, మిరాజ్, సిటీ ప్రైడ్, ఏషియన్ సినిమాస్, మూవీ టైమ్, మూవీ మ్యాక్స్ వంటి మల్టీప్లెక్స్‌లు 'సినిమా లవర్స్ డే'ని జరుపుకుంటున్నాయి. ఈ వారం విడుదల కానున్న 'మిస్టర్ అండ్ మిసెస్ మహి', 'ఫాస్ట్ చార్లీ', 'సావి', 'స్ట్రేంజర్స్' వంటి సినిమాలను కేవలం 99 రూపాయలకే చూసే అవకాశం సినీ ప్రియులకు లభిస్తుంది. ఈ ఆఫర్ ఒక రోజు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. లగ్జరీ సీట్లకు ఈ ఆఫర్ వర్తించదు.

Advertisment
తాజా కథనాలు