Jogi Ramesh : మాజీ మంత్రి జోగి రమేష్‌కు షాక్.. మరో కేసు నమోదు?

AP: అగ్రిగోల్డ్ కుంభకోణం కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. తాను అసలు జోగి రమేష్ ఫ్యామిలీకి స్థలం అమ్మలేదని ఈ కేసులో నిందితుడిగా ఉన్న పోలవరం మురళీమోహన్ సీఐడీ విచారణలో తేల్చిచెప్పారు. దీంతో జోగి రమేష్ ఫ్యామిలీపై ఫోర్జరీ కేసు నమోదు చేసేందుకు సీఐడీ సిద్దమైనట్లు తెలుస్తోంది. 

Jogi Ramesh: జోగి రమేష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా
New Update

Shock To Jogi Ramesh : అగ్రిగోల్డ్ కుంభకోణం కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. తాను అసలు జోగి రమేష్ ఫ్యామిలీకి స్థలం అమ్మలేదని పోలవరం మురళీమోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే కేసులో నిందితుగా పోలవరం మురళీమోహన్ ఉన్నాడు. తాను జోగి ఫ్యామిలీకి ఎటువంటి భూమి విక్రయించలేదని విచారణలో సీఐడీకి వాగ్మూలం ఇచ్చాడు.

అయితే మురళీమోహన్ కి భూమి సర్వే నెంబర్ 88 లో ఉంది.. మొదటి జోగి ఫ్యామిలీ సర్వే నెంబర్ 88 తో రిజిస్ట్రేషన్ చేయించుకొని... సర్వేనెంబర్ 87 గా అధికారాన్ని వినియోగించుకుని రెండోసారి రిజిస్ట్రేషన్ చేయించుకుందని మురళి ఆరోపించారు. రిజిస్ట్రేషన్ సమయంలో తన పేరుతో వచ్చిన డాక్యుమెంట్స్ గాని, ఆధార్ కార్డు గాని తనది కాదని సీఐడీకి మురళి తెలిపాడు. ఈ క్రమంలో మాజీ మంత్రి జోగి ఫ్యామిలీపై ఫోర్జరీ కేసు నమోదు చేసేందుకు సీఐడీ అధికారులు సిద్దమైనట్లు తెలుస్తోంది.

జోగి కొడుకు అరెస్ట్...

ఇటీవల అగ్రిగోల్డ్ భూమలు (Agri Gold Lands) కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌ (Jogi Ramesh) కొడుకు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్‌ ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. సీఐడీ జప్తులో ఉన్న అంబాపురంలో అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేసి అమ్మినట్లు గుర్తించారు. ఏ1 గా జోగి రమేష్ బాబాయి జోగి వెంకటేశ్వరరావు, ఏ2 గా జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్, ఏ3 గా అడుసుమిల్లి మోహన్ రామ్ దాస్, ఏ4 గా అడుసుమిల్లి వెంకట సీత మహాలక్ష్మి, ఏ5 గా గ్రామ సచివాలయం సర్వేయర్ దేదీప్య, ఏ6 గా మండల సర్వేయర్ రమేష్, ఏ7 గా డిప్యూటీ తాసీల్ధార్ విజయ్ కుమార్, ఏ8 గా మండల తసీల్ధార్ పేర్లను ఎఫ్ ఐ ఆర్ లో చేర్చారు అధికారులు.

#jogi-ramesh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe