సీఐ దాడులను అరికట్టాలి..దళిత మహిళ సంచలన వ్యాఖ్యలు.!

ఇబ్రహీంపట్నం సీఐ చేస్తున్న దాడులను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు ఓ దళిత మహిళ గూడపుడి జయప్రద. తనకు రావాల్సిన డబ్బును అడిగినందుకు సంతోష్ అనే వ్యక్తి పోలీసుల సహకారంతో ఇంటి దగ్గర దాడికి దిగారని వాపోయింది.

సీఐ దాడులను అరికట్టాలి..దళిత మహిళ సంచలన వ్యాఖ్యలు.!
New Update

vijayawada: దళిత మహిళ గూడపుడి జయప్రద విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం పోలీస్ అధికారి సర్కిల్ ఇన్స్పెక్టర్ చేస్తున్న దాడులను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆమె మాట్లాడుతూ.. పొట్లూరు విశ్వనాథం అనే వ్యక్తి అపార్ట్మెంట్ లో పనిచేస్తు ఉండేదని తెలిపారు. అయితే, విశ్వనాథం ఆమెకు రూ. 5 లక్షలు ఇవ్వాలని.. అందుకు తను గతంలో ఆయన నుండి అగ్రిమెంటు రాయించుకున్నానని చెప్పింది. కాగా, విశ్వనాథ్ రిసెంట్ గా చనిపోయారని.. దీంతో, ఆ అగ్రిమెంట్లో భాగంగా తమకు రావలసిన డబ్బులు ఇవ్వమని అడిగినందుకు విశ్వనాథ్ కుమారుడు పొట్లూరి సంతోష్, అతని అనుచరులతో ఇంటి దగ్గరికి వచ్చి నిర్బంధించారని.. ఎటువంటి ఆధారాలు లేకుండా, వారెంట్ లెటరు లేకుండా సుమారు 10 మంది పోలీసులు ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న డాక్యుమెంట్లను అన్ని తీసుకొని వెళ్ళిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: కూతుర్ని ప్రేమించాడని యువకుడిని నగ్నంగా చితకబాది..ఏం చేశాడంటే..?

అప్పటి నుండి ఎన్నారై సంతోష్ కులం పేరుతో మమ్మల్ని దూషిస్తూ ఉన్నా సరే పోలీసులు స్పందించకుండా ఎన్నారై సంతోష్ కు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. మమ్మల్ని తీవ్రంగా కొట్టి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేశారని వాపోయారు. ఈ విషయంపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ఇంత వరకు ఎన్నారై సంతోష్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా మాపైనే వేధింపులకి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం సీఐ నుండి తనకు ప్రాణహాని ఉందని సంచలన వ్యాఖ్యలు చేసింది.ఎన్నారై కి చెందిన సంతోష్ పై, స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనకు న్యాయం జరగాలని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. న్యాయం జరగలేని పక్షంలో ఆత్మహత్యే దిక్కని మహిళ వాపోయింది.

#andhra-pradesh #vijayawada
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe