Crime : ఏసీబీ వలలో రావులపాలెం పోలీస్ స్టేషన్.. అడ్డంగా బుక్కైన సీఐ!

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం పోలీస్ స్టేషన్ సీఐ ఆంజనేయులు యాభై వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. కోడిపందాల కేసులో ఇరుక్కున్న లక్ష్మణ్ ఫిర్యాదుతో డీఎస్పీ శ్రీ హరి రాజు ఆధ్వర్యంలో ట్రాప్ చేసి పట్టుకున్నారు. వీడియో వైరల్ అవుతోంది.

New Update
Crime : ఏసీబీ వలలో రావులపాలెం పోలీస్ స్టేషన్.. అడ్డంగా బుక్కైన సీఐ!

AP News : ఏపీలో మరో అవినీతి పోలీస్ అధికారి ఏసీబీ (ACB) కి అడ్డంగా దొరికిపోయాడు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం పోలీస్ స్టేషన్ (Ravulapalem Police Station) సీఐ ఆంజనేయులు యాభై వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అయితే గతంలో కోడిపందాలు వేసిన నేపథ్యంలో పోలీసులకు కుచ్చర్లపాటి లక్ష్మణ్ రాజు అనే వ్యక్తి పట్టుబడ్డాడు. అప్పటి నుంచి కేసులో సెక్షన్స్, ఛార్జ్ షీట్, కఠిన శిక్షలు, రౌడీ షీట్ ఓపెన్ చేస్తానంటూ సీఐ అంజనేయులు (CI Anjaneyulu) లక్ష్మణ్ పై బెదిరింపులకు పాల్పడుతున్నాడు. నిందితుడు తన బాధలు చెప్పినా పట్టించుకోకుండా డబ్బులు ఇవ్వాలని వేధింపులు మొదలుపెట్టాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా.. శనివారం రాజమండ్రి (Rajahmundry) ఏసీబీ డిఎస్పీ శ్రీ హరి రాజు ఆధ్వర్యంలోని ట్రాప్ చేసి అంజనేయులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Also Read : 50 మంది నకిలీ డాక్టర్లు.. ఇద్దరు అరెస్ట్‌.!

Advertisment
Advertisment
తాజా కథనాలు