/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-16T173817.812-jpg.webp)
Sekhar Master: టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట్లో విషాదం నెలకొంది. మంగళవారం తన వదిన చనిపోయారంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. 'వదిన మిస్ యూ. ఎంతో బాధని అనుభవించావు. అయినా ఎంతో ధైర్యంగా నిలబడ్డావ్. నువ్వే నాకు ధైర్యాన్నిచ్చావ్. పాజిటివిటీని పెంచావ్. నువ్వు లేవనే వార్తని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నా. ఇప్పుడైనా స్వర్గంలో ఉంటావ్ అని ఆశిస్తున్నాను. నువ్వెప్పుడు మాతోనే ఉంటావ్. నీ ఆత్మకు శాంతి చేకూరాలి' అంటూ ఎమోషనల్ అయ్యాడు.
View this post on Instagram
ఇక ఆమె శేఖర్ మాస్టర్ భార్యకు అక్క అని తెలుస్తోంది. ఇక టీవీ షోలతో కెరీర్ ప్రారంభించిన శేఖర్ తర్వాత తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. స్టార్ హీరోలతో కలిసి పనిచేస్తూ భారీ పాపులారిటీ సంపాదించుకున్నాడు.