Janasena: జనసేనలో చేరిన జానీ మాస్టర్

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ కండువా కప్పి జానీ మాస్టరు పవన్ కళ్యాణ్ సాదరంగా ఆహ్వానించారు. తెలుగుతో పాటు పలు తమిళ, కన్నడ, సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు జానీ మాస్టర్.

New Update
Janasena: జనసేనలో చేరిన జానీ మాస్టర్

Jani Master Joined in Janasena Party: మరికొన్ని నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జనసేనలోకి భారీ చేరికలు నమోదు అవుతున్నాయి. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ కండువా కప్పి జానీ మాస్టరు పవన్ సాదరంగా ఆహ్వానించారు. కాగా నెల్లూరు జిల్లాకు చెందిన మాస్టర్.. తెలుగుతో పాటు పలు తమిళ, కన్నడ, సినిమాలకు కూడా కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు.

Also Read: చంద్రబాబు అరెస్ట్.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

సినీనటుడు పృథ్వీరాజ్‌

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. అధికార, విపక్ష నేతలు పార్టీలు మారిపోతున్నారు. తాజాగా జనసేన పార్టీలో కొరియోగ్రఫర్ జానీ మాస్టర్‌ చేరిన అనంతరం.. సినీ నటుడు పృథ్వీరాజ్‌ కూడా ఆ పార్టీలో చేరారు. బుధవారం గుంటూరులోని మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పవన్‌ కళ్యాణ్ (Pawan Kalyan) వీళ్లిద్దరికీ జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జానీ మాస్టర్, పృథ్వీ రాజ్‌ చేరికలపై జనసేన కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. 

శ్యాంబాబు వేషాధారణలోనే ప్రచారం

ఇదిలాఉండగా.. ఇటీవల పవన్‌ కల్యాణ్ నటించిన ‘బ్రో’ అనే సినిమాలో మంత్రి అంబటి రాంబాబుకు (Ambati Rambabu) పృథ్వీ రాజ్‌ పేరడి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయంగా దుమారం రేపింది. తాజాగా జనసేనలో (Janasena Party) చేరిన అనంతరం పృథ్వీరాజ్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ రాష్ట్రవ్యాప్తంగా శ్యాంబాబు క్యారెక్టర్ వేషధారణతో టీడీపీ-జనసేన తరపున పర్యటిస్తాను. అందరూ కోరుంటే సత్తెనపల్లి నుంచే శ్యాంబాబు వేషదారణతో ప్రచారం ప్రారంభిస్తా.

ఇప్పటికే వార్ వన్ సైడ్ అయ్యింది. నేను ఏ టిక్కెట్ ఆశించడం లేదు. ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు నా దగ్గర లేదు. ఏ పదవిని ఆశించడం లేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం రావడం ఖాయమని’ పృథ్విరాజ్ అన్నారు. ఇదిలా ఉండగా.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. రెండోసారి అధికారంలోకి రావాలని వైసీపీ పార్టీ ప్రయత్నాలు చేస్తుంటే.. వైసీపీ గద్దె దించే లక్ష్యంగా టీడీపీ-జనసేన తమ వ్యూహాలు రచిస్తున్నాయి. ఈసారి ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. మరీ ఏపీ ప్రజలు ఏ పార్టీకి అధికారం ఇస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

 

Advertisment
తాజా కథనాలు