సామాజిక సాధికారిక బస్సు యాత్ర కాదు.. వైసీపీ బోగస్ యాత్ర .!

అనకాపల్లి జిల్లాలో మంత్రి గుడివాడ అమర్నాధ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చోడవరం జనసేన ఇంచార్జ్ పీవీఎస్ఎన్ రాజు. సామాజిక సాధికారిక బస్సు యాత్ర పేరుతో వైసీపీ ఒక బోగస్ యాత్ర కు శ్రీకారం చుట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
సామాజిక సాధికారిక బస్సు యాత్ర కాదు.. వైసీపీ బోగస్ యాత్ర .!

Janasena on YSRCP Bus Yatra: నేడు అనకాపల్లి జిల్లా కేంద్రంలో వైసీపీ సామాజిక సాధికారిక బస్సుయాత్ర నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) తో సహా జిల్లాలోని వైసీపీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.  ఈ క్రమంలో వైసీపీ బస్సు యాత్రకు శాంతియుతంగా నిరసన తెలిపారు జిల్లాలోని జనసైనికులు. ప్రజలకు ఏం చేశారంటూ వైసీపీ సామాజిక సాధికారిక బస్సు యాత్ర నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. దీంతో పోలీసులు జనసైనికులను అడ్డుకుని వారిని అరెస్ట్ చేశారు.

Also Read: ఆర్మీ జవాన్ పై పోలీసుల దాడి.. అనకాపల్లి జిల్లా ఎస్పీ సీరియస్‌ యాక్షన్‌..!

జనసైనికుల అరెస్ట్ విషయం తెలుసుకున్న చోడవరం జనసేన (Janasena) పార్టీ ఇంచార్జ్ పీవీఎస్ఎన్ రాజు పోలీస్ స్టేషన్ కు పెళ్లి వారిని విడిపించారు. ఆనంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రి గుడివాడ అమర్నాధ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం లో ప్రజాస్వామ్యం అనేది లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం, ప్రతిపక్షాలను అణచివేసే ధోరణిలో పోలీసులతో ఇస్టా రాజ్యంగా అరెస్టు లు చేయడం పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సామాజిక సాధికారిక బస్సు యాత్ర పేరుతో వైసీపీ ఒక బోగస్ యాత్ర కు శ్రీకారం చుట్టిందని విమర్శలు గుప్పించారు. బీసీలకు,ఎస్సీలకు ఏమీ చేయకపోయినా చేసినట్టు బిల్డప్ ఇస్తూ ఈ బస్సు యాత్ర ను వైసీపీ చేయడం హస్యాస్పదంగా ఉందని ఎద్దెవ చేశారు. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ మూతపడేటప్పుడు ఏమీ చేయలేని మంత్రి అమర్నాధ్ ..చెరుకు రైతులకు న్యాయం చేయలేని ,చేతకాని మంత్రి ఈ రోజు సామాజిక బస్సుయాత్ర చేస్తుంటే ప్రజలంతా నవ్వుకుంటున్నారని కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మంత్రి అని చెప్పుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమిటో చెప్పాలని అమర్నాధ్ కు సవాల్ విసిరారు.


సచివాలయ సిబ్బందితో పాటు వాలంటీర్లతో డ్వాక్రా మహిళలను, ప్రజలను బస్సు యాత్రకు హాజరవ్వాలని ఒత్తిడి చేసి మరి ప్రజలను రప్పించుకుని ఈ బోగస్ యాత్రలు చేయడం అవసరమా అని ప్రశ్నించారు చోడవరం జనసేన పార్టీ ఇంచార్జ్ పీవీఎస్ఎన్ రాజు. వైసీపీ ప్రభుత్వం లో ప్రజలకు రక్షణ అనేది లేకుండా పోయిందని దుయ్యబట్టారు. వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం పెట్టారు..నూవ్వే అవసరం లేదు అలాంటిది మళ్లీ ఏపీకి నీ అవసరమేంటి అంటూ కౌంటర్లు వేశారు. విశాఖ జిలా గ్రామీనంలో పంటలకు నీరు లేక పొలాలు బీళ్లు వారుతుంటే 9 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయలేని ఈ చేతకాని ప్రభుత్వం సామాజిక సాధికారత ఎలా చేస్తుందని ఎద్దేవా చేశారు.

Advertisment
తాజా కథనాలు