Chiyaan Vikram : రాజమౌళితో సినిమా నిజమే.. కానీ : చియాన్ విక్రమ్

కోలీవుడ్ హీరో విక్రమ్ రాజమౌళితో సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన..'రాజమౌళితో సినిమా గురించి చర్చలు జరిపిన విషయం వాస్తవమే. ఆయనతో సినిమాకు టైం పడుతుంది. మేము సరైన స్క్రిప్ట్‌ కోసం ఎదురుచూస్తున్నాం' అని పేర్కొన్నారు.

Chiyaan Vikram : రాజమౌళితో సినిమా నిజమే.. కానీ : చియాన్ విక్రమ్
New Update

Chiyaan Vikram : కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన 'తంగలాన్’ సినిమా ఆగస్టు 15 న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. . పా.రంజిత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో విక్రమ్ మరోసారి తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాను ఇప్పుడు హిందీలోనూ విడుదల చేయనున్నారు.

సెప్టెంబర్‌ 6న 'తంగలాన్‌' హిందీ వెర్షన్ థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో విక్రమ్ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళితో సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ మేరకు ఆ ఇంటర్వ్యూలో విక్రమ్ మాట్లాడుతూ.." రాజమౌళితో సినిమా గురించి చర్చలు జరిపిన విషయం వాస్తవమే.

Also Read : బిగ్ బాస్ సీజన్-8 ఫైనల్ కంటెస్టెంట్స్ ఫుల్ లిస్ట్ ఇదే.. ఈసారి మాజీలు కూడా

ఆయనతో సినిమా చేస్తాను. కానీ, దానికి సమయం పడుతుంది. భారతదేశంలోని అత్యంత గొప్ప దర్శకుల్లో రాజమౌళి ఒకరు. మేము సరైన స్క్రిప్ట్‌ కోసం ఎదురుచూస్తున్నాం" అని అన్నారు. దీంతో రానున్న రోజుల్లో వీరిద్దరి కాంబోలో సినిమా ఉంటుందని స్వయంగా విక్రమ్ హింట్ అవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe