BhavyaSri: మిస్టరీగా మారిన ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ దారుణ హత్య

చిత్తూరు జిల్లా పెనుమూరులో ఇంటర్ విద్యార్థిని భవ్య అనుమానస్పద మృతి కేసు మిస్టరీగా మారింది. కావూరివారిపల్లె పంచాయతీ, ఠాణా వేణుగోపాలపురంకి చెందిన భవ్యశ్రీ ఈనెల 17వ తేది రాత్రి అదృశ్యమైంది. 18వ తేదీ యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదుచేశారు.

BhavyaSri: మిస్టరీగా మారిన ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ దారుణ హత్య
New Update

BhavyaSri: చిత్తూరు జిల్లా పెనుమూరులో ఇంటర్ విద్యార్థిని భవ్య అనుమానస్పద మృతి కేసు మిస్టరీగా మారింది. కావూరివారిపల్లె పంచాయతీ, ఠాణా వేణుగోపాలపురంకి చెందిన భవ్యశ్రీ ఈనెల 17వ తేది రాత్రి అదృశ్యమైంది. 18వ తేదీ యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదుచేశారు. 20వ తేదీన గ్రామంలో వినాయక నిమజ్జనం చేస్తుండగా చెరువులో భవ్యశ్రీ శవమై కనిపించింది.  బాలిక మృతదేహం చూసిన కొందరు యువకులు కేకలు వేస్తూ గ్రామస్తులకు విషయం చెప్పారు. దీంతో అందరూ బావి దగ్గరకు చేరుకుని పోలీసులకు  సమాచారం ఇచ్చారు. అందరూ కలిసి బావిలోని విద్యార్థిని డెడ్ బాడీని బయటకు తీశారు. ఆ మృతదేహం భవ్యశ్రీదిగా గుర్తించారు. కుమార్తె చనిపోయిందని తెలిసి... భవ్యశ్రీ కుటుంబసభ్యులు శోకసంద్రంలో‌ మునిగిపోయారు‌. ఆమెకు అర్థ శిరోముండనం చేసి, కనురెప్పలు కత్తిరించి ఉరివేసి చంపేసిన తర్వాత బావిలో పడేశారని బంధువులు ఆరోపిస్తున్నారు.

కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని వడ్డెర సంఘలం నాయకులతో పాటు బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం మూడ్రోజులుగా నీటిలోనే ఉన్నందున జుట్టు ఊడిపోయిందని, ప్రాథమికంగా ఎలాంటి గాయాలు లేవని వచ్చిందని చెబుతున్నారు పోలీసులు. అయితే గ్రామస్తులు, కుటుంబసభ్యులు మాత్రం అంగీకరించలేదు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదన్నారు. అనుమానితులను వేంటనే అదుపులోకి తీసుకుని విచారణ జరపాలని డీఎస్పీ ఆదేశించడంతో వడ్డెర సంఘం నాయకులు శాంతించారు.  భవ్యశ్రీ మృతిదేహం లభించిన బావి వద్దకు వెళ్లి.. సంఘటనాస్థలిని పరిశించారు చిత్తూరు డీఎస్పీ. నలుగురు యువకులపై అనుమానం ఉందని చెప్పడంతో... వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అఘాయిత్యం జరిగిందా..? విషప్రయోగం జరిగిందా..? అనే దానిపై పరీక్షించేందుకు శాంపిల్స్‌ను తిరుపతి RFSLల్యాబ్‌కు పంపామని పోలీసులు తెలిపారు. ఆ నివేదికలు వచ్చిన తర్వాత నిందితులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

#inter-girl #chittoor #bhavyasri
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe