AP: ఏపీలో హడలెత్తిస్తున్న చిరుతలు.. భయాందోళనలో బ్రతుకుతున్న ప్రజలు.!

ప్రకాశం జిల్లా గిద్దలూరులో చిరుత కలకలం సృష్టిస్తోంది. చిరుతను చూసి స్థానికులు భయంతో కేకలు వేయగా చిరుత పాడుబడ్డ బావిలో చొరబడింది. వెంటనే అటవీశాఖ అధికారులకు స్థానికులు సమాచారం ఇవ్వగా అధికారులు బావి చుట్టు వలపన్ని చిరుతను బంధించారు. అడవిలో విడిచిపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

New Update
AP: ఏపీలో హడలెత్తిస్తున్న చిరుతలు.. భయాందోళనలో బ్రతుకుతున్న ప్రజలు.!

Prakasam: ఏపీలో చిరుతలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. రెండ్రోజుల క్రితం నంద్యాల-గిద్దలూరు ఘాట్‌ రోడ్డులో పచర్ల గ్రామం దగ్గర మహిళపై చిరుత దాడి చేసిన సంగతి తెలిసిందే. తరువాత మహానంది గోశాల దగ్గర మళ్లీ చిరుత సంచారం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సీసీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. చిరుతల సంచారంతో స్థానిక ప్రజలు భయం భయంగా బ్రతుకుతున్న పరిస్థతి కనిపిస్తోంది.

Also Read: వామ్మె.. ఫోన్ పేలి యువకుడు మృతి..!

తాజాగా, ప్రకాశం జిల్లా గిద్దలూరులోనూ చిరుత కలకలం సృష్టిచింది. లింగాపురం ప్రాంతంలో చిరుతను చూసిన స్థానికులు ఒక్కసారిగా భయంతో కేకలు వేయగా చిరుత ఓ పాడుబడ్డ బావిలోకి చొరబడింది. వెంటనే అటవీశాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. అలర్ట్ అయిన ఫారెస్ట్‌ సిబ్బంది బావి చుట్టు వలపన్ని చిరుతను బంధించారు. అనంతరం, బంధించిన చిరుతను అడవిలో విడిచిపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు