Pawan Kalyan : చిరంజీవి చిన్న కూతురు శ్రీజ-భరద్వాజ్ పెళ్లి.. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఏం చేశారో తెలుసా?

కొన్ని రోజులుగా లంగ్స్ డ్యామేజ్‌తో బాధపడుతున్న శిరీష్ భరద్వాజ్ చనిపోయారు. చిరంజీవి రెండో కూతురు శ్రీజను ప్రేమించి పెళ్లి చేసుకున్న భరద్వాజ్‌.. ఆ తరువాత విడాకులు ఇచ్చారు. పెళ్లి సమయంలో మీడియా ముందు ప్రాణహాని ఉందని చెప్పడం..పవన్‌ తన గన్‌ ని పోలీసులకు ఇవ్వడం పెద్దచర్చ అయ్యింది.

New Update
Pawan Kalyan : చిరంజీవి చిన్న కూతురు శ్రీజ-భరద్వాజ్ పెళ్లి.. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఏం చేశారో తెలుసా?

What Pawan Kalyan Did : అది 2007.. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) గన్‌ పట్టుకోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు.. ఈ గన్‌ నాకు అవసరం లేదని పోలీసులకు హ్యాండ్‌ ఓవర్‌ చేశాడు. ఆ సీన్‌ తలుచుకుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆవేశంగా ఆనాడు పవన్‌ మాట్లాడిన తీరు అందరిని షాక్‌కు గురి చేసింది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ప్రేమ పెళ్ళీ వ్యవహారం అప్పట్లో వెరీ వెరీ హాట్‌ టాపిక్‌. అదో సెన్సేషన్‌. తమకు ప్రాణ హాని ఉందని శ్రీజ దంపతులు మీడియా ముందే చెప్పడం.. పవన్‌కల్యాణ్‌ గన్‌ను పోలీసులకు హ్యాండోవర్‌ చేయడం చకాచకా జరిగిపోయాయి. ఇక శ్రీజ (Sreeja) మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ (Shirish Bharadwaj) మరణం వేళ యావత్‌ తెలుగు ప్రజలు ఈ ఘటనలు గుర్తు చేసుకుంటున్నారు.

కొన్ని రోజులుగా లంగ్స్ డ్యామేజ్‌తో బాధపడుతున్న శిరీష్ భరద్వాజ్ చనిపోయారు. చిరంజీవి (Chiranjeevi) రెండో కూతురు శ్రీజను ప్రేమించి పెళ్లి చేసుకున్న భరద్వాజ్‌.. ఆ తరువాత విడాకులు ఇచ్చారు. వీరికి ఒక కూతురు ఉంది. విడాకులు తీసుకున్న భరద్వాజ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. మరోవైపు శ్రీజ కూడా రెండో పెళ్లి చేసుకున్నారు.

2007లో శ్రీజ ఇంట్లో అందరిని ఎదురించి మరీ శిరీష్ భరద్వాజ్‌ని పెళ్ళీ చేసుకుంది. చిరు ఇంట్లో వాళ్లు ఈ పెళ్ళీకి అంగీకరించకపోవడంతో ఆర్య సమాజ్‌లో నాటకీయ పరిణామాల మధ్య శ్రీజ-భరద్వాజ్‌ ఒకటయ్యారు. అప్పటికి శ్రీజ వయసు 19 మాత్రమే. భరద్వాజ్ వయసు 22. మానసికంగా మెచ్యూరిటీ లేని వయసులు ఇవి. తమకు ప్రాణహాని ఉందని మీడియా ముందుకు వచ్చి రచ్చ లేపిన ఈ జంట వివాహం చేసుకున్న తర్వాత కొద్దీ కాలానికి విడిపోయారు.

అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని శ్రీజ 2011లో చిరు ఇంటికి తిరిగి వచ్చేశారు. ఆ తర్వాత విడాకులు మంజురు కావడం.. శ్రీజ మరో వ్యక్తిని పెళ్ళీ చేసుకోవడం సంవత్సరాల గ్యాప్‌లో జరిగిపోయింది. అటు భరద్వాజ్‌ కూడా 2019లో ఓ డాక్టర్‌ను పెళ్ళీ చేసుకున్నారు. ఇక భరద్వాజ్‌ ఏం జాబ్ చేస్తారన్నదానిపై క్లారిటీ లేదు కానీ ఆయన రాజకీయాల్లో కొన్నాళ్లు యాక్టివ్‌గా కనిపించారు. బీజేపీలో అటు ఇటు తిరిగారు. 2014లో మోదీని కూడా మీట్ అయ్యారు.

అయితే శ్రీజ-భరద్వాజ్‌ విడాకుల ఎపిసోడ్‌ వార్తల కంటే అందరికంటే ఎక్కువగా గుర్తుండేది వారి పెళ్ళీ విషయాలే. ఎందుకంటే వీరి పెళ్ళీ వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉందన్న ప్రచారం కూడా అప్పట్లో పెద్ద ఎత్తున జరిగింది. ఈ పరిణామాల మధ్య తమకు ప్రాణ హాని ఉందని శ్రీజ దంపతులు మీడియా ముందు చెప్పడంతో పెద్ద రచ్చ జరిగింది. వెంటనే తన దగ్గర ఉన్న గన్‌ను పవన్‌ పోలీసులకు ఇచ్చేసి మీడియాతో మాట్లాడారు. 'ఆమె మేజర్, ఆమె కోరుకున్నది ఏదైనా చేసే హక్కు ఉంది. కానీ నిజమైన ప్రేమ అంటే పారిపోవటం కాదు.. నిజాన్ని దైర్యంగా ఎదుర్కొవడం అంటూ పవన్‌ మీడియా ముందు డైలాగులు పేల్చారు.

Also read: రాష్ట్రంలో నేటి నుంచి పాలిటెక్నిక్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌

Advertisment
తాజా కథనాలు