Indra : మెగా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. 'ఇంద్ర' రీ రిలీజ్ వాయిదా?

'ఇంద్ర' మూవీ రీ రిలీజ్ వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. చిరు బర్త్ డే కానుకగా రీ రిలీజ్ కావాల్సిన ఈ సినిమాకు థియేటర్ల సమస్య ఎదురైనట్లు సమాచారం. ఆగస్టు15న మూడు పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతుండటంతో 'ఇంద్ర' రీ రిలీజ్ ను పోస్ట్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలిసింది.

New Update
Indra : మెగా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. 'ఇంద్ర' రీ రిలీజ్ వాయిదా?

Indra Movie Re-Release : మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల‌లో ఒకటైన 'ఇంద్ర' రీ రిలీజ్ కానున్నట్టు వైజ‌యంతి మూవీస్ రీసెంట్ గా ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. ఆగస్టు 22 మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఈ సినిమా థియేటర్స్ లో రీ రిలీజ్ కానుందని మేకర్స్ తెలిపారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ రీ రిలీజ్ వాయిదా పడనున్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం థియేటర్ల సమస్య అని తెలుస్తోంది.

ఆగస్టు 15న ‘డబుల్ ఇస్మార్ట్’, ‘మిస్టర్ బచ్చన్’, ‘తంగలాన్’ లాంటి బిగ్ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాలకు అవసరమైన థియేటర్లను కేటాయించడం ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. ఈ సినిమాల రిలీజ్ తర్వాతే 'ఇంద్ర' కు ఎన్ని థియేటర్లు దొరుకుతాయో తెలుస్తుందని, అప్పుడు మాత్రమే రీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసే అవకాశం ఉందని సమాచారం.

Also Read : ఓటీటీలోకి ‘రాయన్’ ఎంట్రీ అప్పుడేనా?

మరోవైపు ఈ సినిమాలు విడుద‌లైన వారం రోజుల‌కే రీ రిలీజ్ ఉండ‌డంతో ఇంద్ర ఎఫెక్ట్ ఈ సినిమాల‌పై ఉంటుంద‌ని, ముఖ్యంగా క‌లెక్ష‌న్ల‌పై ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంద‌ని మేక‌ర్స్ ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తుంది. దీనిపై ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది. చిరు ఫ్యాన్స్ ఇంద్ర రీ రిలీజ్‌ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఈ వార్తతో ఫ్యాన్స్‌లో నిరాశ నెలకొంది.

Advertisment
తాజా కథనాలు