Chiranjeevi: మెగాస్టార్ మైండ్ సెట్ మారిందా?

ఒక్క ఫ్లాప్.. ఒకే ఒక్క ఫ్లాప్.. చిరంజీవి ఆలోచన విధానాన్ని, అతడి భవిష్యత్తు ప్లాజెక్టుల్ని సమూలంగా మార్చేసింది. కళ్యాణ్ కృష్ణతో చిరు చేయబోయే ప్రాజెక్ట్‌ దాదాపు ఆగిపోయింది.

New Update
Chiranjeevi : అది నా బాధ్యత సీఎం గారూ!

ఒక్క ఫ్లాప్.. ఒకే ఒక్క ఫ్లాప్.. చిరంజీవి ఆలోచన విధానాన్ని, అతడి భవిష్యత్తు ప్లాజెక్టుల్ని సమూలంగా మార్చేసింది. కళ్యాణ్ కృష్ణతో చిరు చేయబోయే ప్రాజెక్ట్‌ దాదాపు ఆగిపోయింది. స్వయంగా కూతురు సుశ్మిత నిర్మాతగా చేయాల్సిన ప్రాజెక్టు అది. ఆల్రెడీ కోటి రూపాయలు ఖర్చు కూడా పెట్టారు. అయినప్పటికీ చిరంజీవి మొహమాటపడలేదు. కూతుర్ని వెయిటింగ్ లో ఉండమని చెప్పారు, ప్రాజెక్టు పక్కన పెట్టారు.

ప్రస్తుతం చిరంజీవి ఆలోచన పూర్తి భిన్నంగా సాగుతోంది. ప్రేక్షకులను ఉత్తేజపరిచే, రొటీన్ యాక్షన్-కమర్షియల్ ఎంటర్టైనర్ కాకుండా.. ఒక విభిన్నమైన చిత్రంతో ముందుకు వెళ్లాలనుకుంటున్నారు. బింబిసార దర్శకుడు మల్లిడి వశిస్ట్‌తో ఆయన చేయబోయే సినిమా అలాంటిదే.

చాలా కాలం తర్వాత మెగాస్టార్ చేస్తున్న ఫాంటసీ సినిమా ఇది. అప్పుడెప్పుడో జగదేకవీరుడు అతిలోకసుందరి చేశారు. ఆ తర్వాత అంజి లాంటి ప్రయోగం చేశారు. మళ్లీ ఇన్నేళ్లకు వశిష్ఠ దర్శకత్వంలో పంచభూతాల కాన్సెప్ట్ తో ఓ ఫాంటసీ సినిమాకు ఓకే చెప్పారు. ఈ కొత్తదనానికి, తన స్టార్ ఇమేజ్ సరిగ్గా సరిపోతుందని, బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితం ఇస్తుందని చిరంజీవి భావిస్తున్నారు.

అంతేకాదు.. కూతురి సినిమాను ఆపేసిన చిరంజీవి, ఆ స్థానంలో త్రివిక్రమ్ తో కలిసి పనిచేయాలనుకుంటున్నారు. ఇదే విషయాన్ని త్రివిక్రమ్‌కి తెలియజేశారు మెగాస్టార్. దీనికి త్రివిక్రమ్ కూడా ఓకే చెప్పాడు. నిజానికి వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పట్నుంచో ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తను సినిమా చేస్తానని, ఓ ఫంక్షన్ లో సభాముఖంగా చెప్పారు చిరంజీవి. అది ఇన్నాళ్లకు కార్యరూపం దాలుస్తున్నట్టుంది.

గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్‌తో కలిసి పనిచేయాల్సి ఉంది. కానీ అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత అట్లీతో వెళ్లాలని అనుకుంటున్నాడట. అదే కనుక జరిగితే, చిరంజీవితో కలిసి త్రివిక్రమ్ సెట్స్ పైకి రావడం చిటికెలో పని. ఈ ఈక్వేషన్స్ అన్నీ పక్కనపెడితే, నిజంగా త్రివిక్రమ్ తో చిరంజీవి సినిమా చేయాలనుకుంటే, అందరూ మెగాస్టార్ కు దారివ్వాల్సిందే. ఈ విషయంలో చిరంజీవికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఆయన స్థాయి అది.

Advertisment
తాజా కథనాలు