Chinta Mohan : కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి చిరంజీవినే : చింతమోహన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, చిరంజీవినే కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి అని మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు.

New Update
Chinta Mohan : కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి చిరంజీవినే  : చింతమోహన్ సంచలన వ్యాఖ్యలు

Chinta Mohan: మెగాస్టార్ చిరంజీవే (Chiranjeevi) తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని మాజీ ఎంపీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చింతా మోహన్   సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి నుంచి పోటీ చేయడానికి చిరంజీవిని ఆహ్వనిస్తామని, అక్కడినుంచి పోటీ చేస్తే ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎపీలో కాంగ్రెస్ (AP Congress) అధికారంలోకి రావడం పక్కా అని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 130 సీట్లు, లోక్ సభ ఎన్నికల్లో 20 సీట్లు గెలుస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న ఆయన కాపులకు ఇదే మంచి అవకాశమని అన్నారు.

ఇది కూడా చదవండి : Gadwal Bus Accident: సీసీ ఫుటేజీలో రికార్డైన దృశ్యాలు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

చిరంజీవి తిరుపతి (Tirupati) నుంచి పోటీ చేస్తే 50 వేల మెజారిటీతో గెలిపిస్తామని అన్నారు. చిరంజీవి తిరిగి రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇదే మంచి సమయమని, ఆయన ఎంత తొందరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. చిరంజీవిని తనే స్వయంగా పార్టీలోకి ఆహ్వానిస్తానని చింతామోహన్ వెల్లడించారు. ఎన్నికల్లో చిరంజీవి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదని, నామినేషన్‌ వేసి వెళ్లిపోతే చాలు. ప్రజలు చిరంజీవికి ఓటువేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమిలో (INDIA Alliance) భాగంగా ఉన్న అన్ని పార్టీలతో కలిసి పోటీ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఇండియా కూటమి వైపు ప్రజలు చూస్తున్నారని, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ విజయమే అందుకు నిదర్శనమని చెప్పారు.

గతంలోనూ చింతామోహన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కాకుండా చిరంజీవికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. చిరంజీవి తనకు మంచి మిత్రుడని, చిరంజీవికి రాజకీయ సమీకరణలు తెలియకపోవడం వల్లే ముఖ్యమంత్రి కాలేకపోయారన్నారు.

ఇది కూడా చదవండి :Sankranthi: పల్లెబాట పట్టిన పట్నం.. కిక్కిరిసిన బస్సులు, హోటళ్లు

వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరిన సమయంలో చింతా మోహన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపుఎపీ రాజకీయాల్లో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు అధికార వైసీపీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటిస్తూ ముందుంది. మరోవైపు టీడీపీ, జనసేన పొత్తు రాజకీయాలతో ముందుకు పోతుండగా, బీజేపీ కూడా వారితో కలుస్తుందన్న ప్రచారం సాగుతుంది. ఈ సమయంలోనే కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అధిష్టానం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది.

Advertisment
తాజా కథనాలు