Anushka Malhotra: చిరంజీవి కూతురు ఎలా మారిపోయిందో చూడండి..! ఫొటోస్ వైరల్

మెగాస్టార్- సిమ్రాన్ జంటగా నటించిన 'డాడీ' మూవీలో చిరంజీవి కూతురిగా అక్షయ పాత్రలో నటించిన పాప అందరికీ గుర్తుండే ఉంటుంది. చిన్నప్పుడు ముద్దు ముద్దు మాటలతో ఫిదా చేసిన ఈ చిన్నారి ఇప్పుడు హీరోయిన్లకే పోటీ ఇచ్చేలా మారిపోయింది. ఆమె ఎవరో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి.

New Update
Anushka Malhotra: చిరంజీవి కూతురు ఎలా మారిపోయిందో చూడండి..!  ఫొటోస్ వైరల్

Anushka Malhotra: సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ లు గా ఎంతో మంది పిల్లలు కనిపిస్తారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే ప్రేక్షకులకు గుర్తుండిపోతారు. చైల్డ్ ఆర్టిస్ట్ లుగా పేరు తెచ్చుకున్న చాలా మంది ఇండస్ట్రీలోనే కొనసాగుతూ ఉంటారు. కాలం కలిసి వస్తే హీరో, హీరోయిన్లు కూడా అవుతారు.

publive-image

అయితే మెగాస్టార్- సిమ్రాన్ జంటగా నటించిన 'డాడీ' మూవీలో చిరంజీవి కూతురిగా అక్షయ పాత్రలో నటించిన చిన్నారి గుర్తుండే ఉంటుంది. సినిమాలో తన ముద్దు ముద్దు మాటలు, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. కానీ ఆ తర్వాత సినిమాలకు దూరమైపోయిన ఈ చిన్నారి.. ఇప్పుడు హీరోయిన్స్ కు ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా మారిపోయింది. డాడీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన ఈ పాపకు సంబంధించిన ఫొటోలు, ప్రస్తుతం నెట్టింట వైరల్  అవుతున్నాయి. అసలు ఈ అమ్మాయి పేరేంటి..? ఆమె ఏం చేస్తుంది అనే విషయాలు తెలుసుకుందాము...

Also Read: Rashmika Mandana: పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ లుక్ పోస్టర్.. రష్మిక బర్త్ డే సర్ ప్రైజ్ అదిరిపోయిందిగా..!

publive-image

ఆ పాప పేరు అనుష్క మల్హోత్ర. ముంబాయిలో పుట్టి పెరిగిన ఈమె ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హమ్‌లో కుటుంబంతో కలిసి ఉంటోంది. డాడీ సినిమాతో మెప్పించిన ఈ చిన్నది.. ఆ తర్వాత చదువు పై దృష్టి పెట్టాలని సినిమాలకు దూరమైనట్లు తెలుస్తోంది.

publive-image
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న అనుష్క మల్హోత్రా.. ప్రస్తుతం మార్కెటింగ్ స్టేటజిస్ట్‌ అనే ఉద్యోగం పనిచేస్తోంది. తాజాగా ఈమెకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

publive-image

సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది ఈ చిన్నది. అప్పుడప్పుడు తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది.

publive-image

దాదాపు 22 ఏళ్ళ తర్వాత ఈమెను చూసిన నెటిజన్లు ముందుగా గుర్తుపట్టలేకపోయారు. హీరోయిన్స్ కు పోటీ ఇచ్చేలా కనిపిస్తున్న ఈమెను చూసి ఇంత అందంగా మారిపోయిందేంటని ఆశ్చర్యపోతున్నారు.

Also Read: Raashii Khanna: హైదరాబాద్ లో రాశీ కన్నా కొత్త ఇంటి గృహప్రవేశం .. వైరలవుతున్న ఫొటోలు

Advertisment
Advertisment
తాజా కథనాలు