Chiranjeevi: మెగాస్టార్ చిరు ఎంతో ఇష్టపడి చేస్తే వచ్చింది జీరో అట..!

ఎంతో ఇష్టపడి చిరంజీవి సొంతంగా కె.బాలచందర్ దర్శకత్వంలో నిర్మించిన రుద్రవీణ సినిమా జాతీయస్థాయిలో అవార్డులు గెలుచుకుంది కానీ.. కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఈ విషయాన్ని ఇటీవల చిరంజీవి సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ 2024లో చెప్పారు. 

Chiranjeevi: మెగాస్టార్ చిరు ఎంతో ఇష్టపడి చేస్తే వచ్చింది జీరో అట..!
New Update

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)..  టాలీవుడ్.. బాలీవుడ్ ఇలా ఏ వుడ్ లోనైనా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేని పేరు. ఇంతై.. వటుడింతై అన్నట్టు చిన్న నటుడిగా తెలుగు సినిమాలో ఎంట్రీ ఇచ్చి.. నాలుగున్నర దశాబ్దాలుగా టాలీవుడ్ మెగాస్టార్ గా .. తన ముందు తరానికి.. ఇప్పటి తరానికి మధ్య వారధిలా నిలిచిన లెజండరీ యాక్టర్. ఇప్పటికీ మొదటి సినిమా సమయంలో ఎంత క్రమశిక్షణతో ఉన్నారో.. అంతే క్రమశిక్షణ చిరంజీవిది. ఆయనతో నటించిన తోటి నటులు.. సినిమాలు తీసిన దర్శకులు చెప్పే మాట ఇది. చిరంజీవి(Chiranjeevi) వచ్చాకా మాస్ సినిమాలకి ఒక లెక్క వచ్చింది. అప్పటిదాకా ఒకరకంగా ఉన్న తెలుగు సినిమా ఆ తరువాత మాస్ సినిమా రేంజ్ ఎలా ఉంటుందో చూసింది. 

చిరంజీవి అంటేనే మాస్ హీరో అనే ముద్ర పడిపోయింది. కానీ.. చిరంజీవి(Chiranjeevi) క్లాస్ సినిమాలు చూస్తే ఆయన నిజమైన నటస్వరూపం కనిపిస్తుంది. ఒక శుభలేఖ.. ఒక మంత్రిగారి వియ్యంకుడు.. ఒక స్వయంకృషి.. ఒక ఆపద్భాంధవుడు.. ఒక చంటబ్బాయ్.. ఆరాధన.. రుద్రవీణ.. ఇలా చిరంజీవిలో నిజమైన నటుడిని ఆవిష్కరించిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ, చిరంజీవి అంటే స్టెప్పులు.. ఫైట్లు.. ఇవి లేకపోతే సగటు ప్రేక్షకుడికి ఎదో వెలితి. సినిమా ఎంత బావున్నా.. చిరంజీవి(Chiranjeevi) సినిమా అంటే ఈ రెండు ఉండాల్సిందే. ఈ పరిస్థితి తెచ్చింది ఖైదీ సినిమా. అయితే.. ఆ తరువాత చిరంజీవి చేసిన గూండా.. యమకింకరుడు.. ఇలాంటి సినిమాలన్నీ చిరంజీవి(Chiranjeevi) అంటే ఇలానే ఉండాలి అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయేలా చేశాయి. 

Also Read: థ్రిల్లింగ్ సినిమా.. చూడటం మొదలు పెడితే.. చివరి వరకూ కదలరంతే!

అయితే, చిరంజీవికి క్లాస్ సినిమాలు చేయాలని తెగ ఉత్సాహం. అదీకాకుండా బాలసుబ్రహ్మణ్యం లాంటి వారు నువ్వు.. ఇలా వరుసగా మాస్ సినిమాలు చేసి.. చేసి.. నీలోని నటుడ్ని చంపేస్తున్నావు అని చనువుగా హెచ్చరించేవారట. అయితే.. తన సినిమాలు ఫెయిల్ అయినా.. సరిగ్గా డబ్బులు రాబట్టకపోయినా నిర్మాత జేబు ఖాళీ అయిపోతుందని.. మాస్ సినిమాలవైపు ఉండిపోయారట చిరంజీవి. కానీ, నటుడిగా తన సంతృప్తి కోసం ఒక సినిమా చేయాలని అనుకున్నారట చిరు. అప్పుడు అలంటి సినిమాకి తానే నిర్మాతగా ఉండాలని భావించి.. నష్టం వస్తే తనకే రావాలని.. అంజనా ప్రొడక్షన్స్ బేనర్ స్టార్ట్ చేశారు. దానిలో మొదటి సినిమాగా రుద్రవీణ సినిమా చేశారు చిరంజీవి. కె.బాలచందర్ దర్శకత్వంలో చిరంజీవి(Chiranjeevi) చేసిన సూపర్ క్లాస్ మూవీ ఇది. సామాజిక సందేశంతో చక్కని సంగీతంతో.. చిరంజీవి కోరికను తీర్చేలా సినిమా తీర్చిదిద్దారు కె.బాలచందర్. ఈ సినిమాకి ఆరు జాతీయ అవార్డులు వచ్చాయి. బాలసుబ్రహ్మణ్యం కూడా ఈ సినిమా ద్వారా జాతీయ అవార్డు అందుకున్నారు. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం నిలబడలేకపోయింది. చిరంజీవి(Chiranjeevi) ఛరిష్మాతో ఓపెనింగ్స్ వచ్చినా లాంగ్ రన్ లో నిలబడలేకపోయింది. దీంతో ఈ సినిమా నష్టాలను మిగిల్చింది. చిరంజీవితో క్లాస్ సినిమాలు చేయాలనే ఆలోచన ఏ నిర్మాతకు రాకుండా చేసింది. ఈ విషయాన్ని ఇటీవల చిరంజీవి స్వయంగా చెప్పారు. 

ఆహా - పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఇటీవల నిర్వహించిన  సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్ - 2024లో చిరంజీవి(Chiranjeevi) ఈ విషయాలను చెప్పారు. ఫిలిం ఫెస్టివల్ లో ఫైర్ సైడ్ చాట్ పేరుతో రాజీవ్ మసంద్ తో చిట్ చాట్ నిర్వహించారు. ఇందులో భాగంగా చిరంజీవి తన సినీ జీవితవిశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తన మాస్ కెరియర్ గురించి మాట్లాడుతూ. . చిరంజీవి రుద్రవీణ సినిమా అనుభవాన్ని చెప్పారు. 

#tollywood #chiranjeevi #tollywood-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe