Paris Olympics 2024 : అటు పసిడి పట్టే.. ఇటు పిల్లకి రింగు పెట్టే!

పారిస్‌ ఒలింపిక్స్‌ 2024 లో ఓ అద్భుతమైన స్టోరీ కనిపించింది. చైనీస్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు హువాంగ్, కియాంగ్ లు బంగారు పతకాన్ని అందుకున్నారు. ఈ క్రమంలోనే కియాంగ్‌ స్నేహితుడు లియో యోచన్‌ ఆమెకు పెళ్లి ప్రపోజల్‌ తెవడంతో ఆమె అంగీకరించి ఒలింపిక్స్‌ వేదికగా ఉంగరాలు మార్చుకున్నారు.

New Update
Paris Olympics 2024 : అటు పసిడి పట్టే.. ఇటు పిల్లకి రింగు పెట్టే!

China Shuttler Gets Marriage Proposal From Teammate : పారిస్‌ ఒలింపిక్స్‌ 2024 (Paris Olympics 2024) లో ఇప్పటి వరకు 7 రోజుల ఆటలు పూర్తయ్యాయి. ప్రతి దేశం కూడా పతకాల వేటలో ఉంది. అటు సంబరాలు.. ఇటు నిరాశ, నిస్పృహాల మధ్య ఒలింపిక్స్‌ లో ఓ అద్భుతమైన స్టోరీ కనిపించింది. ఈ ఒలింపిక్స్‌ ఓ చైనా క్రీడాకారుడికి జీవితాంతం గుర్తిండి పోయే స్పెషల్ మూమెంట్‌లా నిలిచిపోయింది. ఈసారి ఒలింపిక్స్‌లో అటు ఓ చేత్తో బంగారు పతకాన్ని అందుకుంటే... మరో చేత్తో తన జీవిత భాగస్వామి (Life Partner) ని అందుకున్నాడు.

చైనీస్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు హువాంగ్ (Huang Ya Qiong), కియాంగ్ తమ జీవితంలో ఈ ఒలింపిక్స్‌ ను మాత్రం ఎప్పటికీ మరచిపోలేరు. ఆగస్టు 2న, అతను సహచరుడు జెంగ్ సివే (Jeng Sive) తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో బంగారు పతకాన్ని సాధించాడు.ఈ చైనా క్రీడాకారులు దక్షిణ కొరియా జోడీ కిమ్ వాన్ హో, జియోంగ్ నా యున్‌ల జోడీతో తలపడి ఓడించారు. ఈ మ్యాచ్‌లో చైనాకు చెందిన చోయ్ 21-8, 21-11తో 41 నిమిషాల్లో దక్షిణ కొరియా ద్వయాన్ని ఓడించింది.

మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్ ముగిసిన తర్వాత, పతక వేడుక జరిగింది. ఇక్కడ హువాంగ్, కియోంగ్ బంగారు పతకాన్ని అందుకున్నారు. అనంతరం హువాంగ్ కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ క్రమంలో కియోంగ్‌ బాయ్‌ఫ్రెండ్ లియో యోచన్‌ ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇందుకు ఆమె నో చెప్పలేకపోయింది. బాయ్‌ఫ్రెండ్ లియో యోచన్‌ తన ప్రేమను తన స్టైల్లో ప్రపోజ్ చేశాడు. హువాంగ్ యాకియోంగ్‌కు ఉంగరాన్ని అందించాడు. లియూ యూచెన్ కూడా ఒక బ్యాడ్మింటన్ క్రీడాకారిణి.

Also read: మరొక్క అడుగు.. 25 మీటర్ల పోటీలో ఫైనల్‌కు చేరిన మనుబాకర్!

Advertisment
Advertisment
తాజా కథనాలు