Corona: వామ్మో ఇది మాముల వైరస్ కాదు.. సోకితే చావే.. అసలు చైనా ఏం చేస్తోంది? 100శాతం ప్రమాదకరమైన కరోనా వేరియంట్‌పై చైనాలో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ వైరస్ మరణాల రేటు 100 శాతంగా ఉంది. SARS-CoV-2కి చెందిన GX-P2V అనే ఉపరకంపై చైనా ప్రయోగాలు చేయగా.. 8 రోజుల్లోనే ఎలుకలన్నీ చనిపోయాయి. ఎలుకల్లో ఊపిరితిత్తులు, ఎముకలు దెబ్బతిన్నాయి. By Trinath 17 Jan 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి China experimenting with 100% deadly new Covid strain: కరోనా(Corona) మహమ్మారి ఇంకా ప్రపంచాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. గత నెలలో ప్రపంచవ్యాప్తంగా 10 వేల మంది కోవిడ్‌కి బలయ్యారు. అయితే ఇప్పుడు ఇంకో ప్రాణాంతక వైరస్ ప్రపంచం మీదకి రాబోతోందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఇది కూడా చైనా కేంద్రంగా పురుడు పోసుకుంటుందని తెలుస్తోంది. ఈ వైరస్ వస్తే చావు అనేది నూటికి నూరు శాతం గ్యారంటీ అంటున్నారు. ఇంతకీ ఏంటా వైరస్..? అసలు ఈ ప్రచారం వెనకున్న నిజాలేంటో..? ఇప్పుడు తెలుసుకుందాం! డెడ్లీ వేరియంట్‌తో ప్రయోగాలు: కరోనా వైరస్ జాతికి చెందిన ఓ ప్రమాదకర వేరియంట్‌పై చైనాలో ప్రయోగాలు జరుగుతున్నాయని ప్రచారం సాగుతోంది. ఈ వైరస్ మరణాల రేటు 100 శాతంగా ఉన్నట్లు చెప్తున్నారు. వుహాన్‌లో జరిపిన ఓ అధ్యయనంలో ఈ విషయం బయటపడినట్టు కథనాలు వస్తున్నాయి. ఆ కథనాల ప్రకారం SARS-CoV-2కి చెందిన GX-P2V అనే ఉపరకంపై చైనా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఇది 2017లో వెలుగుచూసిన జీఎక్స్ ఉత్పరివర్తనంగా తెలుస్తోంది. గతంలో దీన్ని మలేషియన్ పాంగోలిన్స్ జంతువుల్లో గుర్తించారు. ఎలుకలన్నీ చనిపోతున్నాయి: GX-P2V వేరియంట్‌ని శాస్త్రవేత్తలు ఎలుకలపై ప్రయోగించారట వాటిపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపించిందని, ఎనిమిది రోజుల్లోనే ఎలుకలన్నీ మరణించాయనీ ఆ అధ్యయనం వెల్లడించింది. ఈ వైరస్ దెబ్బకి ఎలుకల ఊపిరితిత్తులు, ఎముకలు, కళ్లు, మెదడు దెబ్బతిన్నాయి ఆ స్టడీలో పేర్కొన్నారు. ఈ వైరస్ సోకితే కొద్ది రోజుల్లో బరువు విపరీతంగా తగ్గిపోతారట. కొన్ని రోజుల్లోనే అసలు నడవలేని స్థితికి చేరతారట. ఈ వైరస్ అత్యంత ప్రమాదకరమైందని ఆ స్టడీలో పేర్కొన్నారు. మనుషులపైనా ప్రభావం చూపుతుందా? ఈ వైరస్ మనుషులపైనా ఇలాంటి లక్షణాలే చూపించే అవకాశముందని నిపుణులు చెప్తున్నారు. GX-P2V వైరస్ మనుషులకి సోకితే పెనుముప్పు తప్పదంటున్నారు అధ్యయనకారులు. దీంతో డ్రాగన్ ప్రయోగాలు ప్రపంచాన్ని వణికించే పరిస్థితి కనిపిస్తోంది. అయితే తాజా ప్రయోగాలతో వుహాన్ ల్యాబ్‌కు సంబంధం లేదట. వేరే ప్రయోగశాలలో ఈ కొత్త వైరస్ ప్రయోగాలు కొనసాగుతున్నాయి అంటున్నారు. వుహాన్ ల్యాబ్‌లోనే 2019లో కరోనా పురుడు పోసుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలామంది అదే నిజమని నమ్ముతున్నారు కూడా. ఆ ఆరోపణలు నిజమని ఎన్నో కథనాలు కూడా వచ్చాయి. అయితే కరోనా పుట్టుకకి సంబంధించిన రహస్యాన్ని మాత్రం ఎవరూ పూర్తి స్థాయిలో బయటపెట్టలేకపోయారు. ఇప్పుడు తాజాగా మరో ప్రాణాంతక వైరస్ ప్రయోగాలు సాగుతున్నాయన్న వార్తలు... ప్రపంచాన్ని చైనా వైపు చూసేలా చేస్తున్నాయి. Also Read: ఒక్క మ్యాచ్‌తో అతను ఎలాంటి ప్లేయరో ఎలా డిసైడ్ చేస్తారు? ఇదేం పద్ధతి! WATCH: #corona మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి