Chile; చిలీ అడవుల్లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఈ ఘటనలో 46 మంది చనిపోయారు. వేలాది ఇళ్లు కాలి బూడిదయ్యాయి. ఈ విషయాన్ని చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ స్వయంగా వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అడవుల్లో భయంకరమైన మంటలు నిరంతరం వ్యాపిస్తున్నాయన్నారు. ఈ అగ్నిప్రమాదం కారణంగా చిలీలో పరిస్థితి నిరంతరం దారుణంగా ఉంది.
అంతకుముందు శనివారం, చిలీ అంతర్గత మంత్రి కరోలినా తోహా మాట్లాడుతూ, ప్రస్తుతం దేశంలోని మధ్య మరియు దక్షిణాన 92 అడవులు అగ్నికి ఆహుతయ్యాయి. కేవలం ఒక్క పూటలోనే సుమారు 43 వేల హెక్టార్ల అడవి అగ్నికి ఆహుతి అయినట్లు చిలీ అధ్యక్షుడు వివరించారు. అడవుల్లో పెరుగుతున్న మంటల దృష్ట్యా, చిలీ ప్రభుత్వం శనివారం కేంద్రం మరియు దక్షిణంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
మృతుల సంఖ్య మరింత పెరగవచ్చు
చిలీలో అడవుల్లో సంభవించిన మంటల వల్ల అక్కడి ఉష్టోగ్రత సుమారు 40 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంది. దీని వల్లే అడవులు అత్యంత వేగంగా మంటలు వ్యాపించి దగ్దం అవుతున్నాయని బోరిక్ అన్నారు. మంటలు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో హెలికాఫ్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించననున్నట్లు తెలిపారు. దీని తరువాత, అడవి మంటల కారణంగా కనీసం 46 మంది మరణించారు. పరిస్థితి ఎలా ఉందో చూస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
వేలాది ఇళ్లు దగ్ధం!
చిలీ అడవుల్లో అగ్ని ప్రమాదాలు సర్వసాధారణం. ఇది జరిగినప్పుడల్లా, డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు. తాజా అగ్నిప్రమాదంలో వేలాది ఇళ్లు ధ్వంసమైనట్లు సమాచారం. నగరమంతా పొగతో నిండిపోయింది. అగ్ని ప్రమాదం కారణంగా వందలాది కుటుంబాలు ఇళ్లను వదిలి వెళ్లిపోయాయి. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. అయినప్పటికీ ప్రభుత్వం తరుపున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Also read: "భారత్ మాతా కి జై” అని గట్టిగా అనండి.. అనడం లేదని మంత్రి ఫైర్!