TS: దయచేసి ఉండండి సారూ.. ఉపాధ్యాయుడి కాళ్ళపై పడి బోరున ఏడ్చేసిన విద్యార్థులు.!

సూర్యాపేట జిల్లా పోలుమల్ల గ్రామంలో ఉపాధ్యాయుడు మెంతబోయిన సైదులు బదిలీ అయ్యాడు. ఈ క్రమంలో పిల్లలకు వీడ్కోలు చెబుతూ స్వీట్స్ పంచి, మంచిగా చదువుకోవాలని సూచించాడు. భావోద్వేగానికి గురైన విద్యార్థులు.. తమను వదిలి వెళ్లిపోకండి సారూ అంటూ ఉపాధ్యాయుడి కాళ్ళపై పడి బోరున విలపించారు.

New Update
TS: దయచేసి ఉండండి సారూ.. ఉపాధ్యాయుడి కాళ్ళపై పడి బోరున ఏడ్చేసిన విద్యార్థులు.!

Suryapet Teacher: మంచిగా విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయుడిని విద్యార్థులు ఎంతగానో ప్రేమిస్తారు. అదే ఉపాధ్యాయుడు బదిలీ అయితే కంటతడి పెట్టుకుని బోరున విలపిస్తారు. తాజాగా, సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో ఇలాంటే ఘటనే జరిగింది. బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుడిని చూసి పిల్లల భావోద్వేగం చెందారు. తమను వదిలి వెళ్లిపోవద్దంటూ టీచర్ ను పట్టుకుని కన్నీటిపర్యంతం అయ్యారు.

Also Read: 10th సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్

పోలుమల్ల గ్రామంలో ZPH పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు మెంతబోయిన సైదులు. ఆయన వేరే ఊరికి బదిలీ అయ్యారు. ఈ క్రమంలో విద్యార్థులకు వీడ్కోలు చెబుతూ స్వీట్స్ ఇస్తూ మంచిగా చదువుకోవాలని సూచించారు. అయితే, వెళ్తున్న ఉపాధ్యాయుడిని చూసి పిల్లలు భావోద్వేగానికి గురయ్యారు. తమను వదిలి వెళ్లిపోకండి సారూ.. దయచేసి ఉండండి సారూ అంటూ టీచర్ కాళ్ళపై పడి బోరున విలపించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు