TS: దయచేసి ఉండండి సారూ.. ఉపాధ్యాయుడి కాళ్ళపై పడి బోరున ఏడ్చేసిన విద్యార్థులు.!
సూర్యాపేట జిల్లా పోలుమల్ల గ్రామంలో ఉపాధ్యాయుడు మెంతబోయిన సైదులు బదిలీ అయ్యాడు. ఈ క్రమంలో పిల్లలకు వీడ్కోలు చెబుతూ స్వీట్స్ పంచి, మంచిగా చదువుకోవాలని సూచించాడు. భావోద్వేగానికి గురైన విద్యార్థులు.. తమను వదిలి వెళ్లిపోకండి సారూ అంటూ ఉపాధ్యాయుడి కాళ్ళపై పడి బోరున విలపించారు.