Cataract: పిల్లలకు కంటిశుక్లం ఎందుకు వస్తుంది..లక్షణాలు ఎలా ఉంటాయి..?

పిల్లల కళ్లలో కంటిశుక్లం చాలా రకాలుగా వస్తుంది. చికిత్స చేయకుండా వదిలేస్తే పూర్తి అంధత్వం సంభవించవచ్చు. ఇంతకి కంటిశుక్లం ఎలా వస్తుంది? కంటి శుక్లాల లక్షణాలేంటి? దీనిపై మరింత సమాచారం కోసం ఆర్టికల్‌ మొత్తం చదవండి.

New Update
Cataract: పిల్లలకు కంటిశుక్లం ఎందుకు వస్తుంది..లక్షణాలు ఎలా ఉంటాయి..?

Cataract: పిల్లల కంటి విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. రంగులో స్ప్లాష్ కనిపించడం, కంటి అద్దాల కోసం తరచూ ప్రిస్క్రిప్షన్ మార్చడం, కంటిశుక్లాలు వస్తే కొన్ని సందర్భాల్లో అన్నీ రెండుగా కనిపిస్తాయి. శ్రద్ధ పెట్టకపోతే దృష్టికి అంతరాయం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వయసుపైబడిన వారికే కాకుండా చిన్నారులకు కూడా కంటిశుక్లాలు వస్తాయి. పిల్లల్లో కంటిశుక్లం రావడానికి నాలుగు ప్రధాన కారణాలు ఉంటాయి. సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణులు అంటున్నారు.

వైద్యులు ఏమంటున్నారు:

పిల్లల కంటి విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానం ఉంటే ప్రతి సంవత్సరం పిల్లల కళ్లను చెకప్‌ చేయించాలని చెబుతున్నారు. కేవలం కంటిశుక్లం మాత్రమే కాదని, ముందుగానే అద్దాలు అవసరమా అనేది కూడా చూసుకోవాలని చెబుతున్నారు. రోగ నిర్థారణ ఎంత తొందరగా చేయిస్తే ప్రమాదాన్ని అంత తగ్గించవచ్చంటున్నారు. బాల్యంలో పిల్లలకు కంటి వ్యాధుల గురించి తెలియకపోవచ్చు. అయితే తల్లిదండ్రులే శ్రద్ధ వహించాలని వైద్యులు చెబుతున్నారు.

కంటి శుక్లాల లక్షణాలు:

1. ఏదైనా లైట్లను చూస్తుంటే చుట్టూ హాలో (గ్లేర్) కనిపించడం. ముఖ్యంగా రాత్రి సమయంలో హెడ్‌లైట్‌లను చూస్తున్నప్పుడు ఇలా జరగడం.
2. కంటిశుక్లాలు వస్తే కొన్ని సందర్భాల్లో అన్నీ రెండుగా కనిపిస్తాయి.
3.రంగులో స్ప్లాష్ కనిపించడం
4.ఎక్కువ కాంతి ఉంటే తప్ప చదవలేకపోవడం
5. కంటి అద్దాల కోసం తరచూ ప్రిస్క్రిప్షన్ మార్చడం
6.కొందరికి పుట్టుకతో కంటిశుక్లం వస్తుంది. మరికొందరికి పుట్టిన తర్వాత ఈ లక్షణాలు బయటపడతాయి.
7. మన కళ్లు ఐరిస్, కార్నియా, లెన్స్, విట్రస్, రెటీనా అనే పొరతో రూపొందించబడ్డాయి.

వారసత్వం కూడా కారణమా..?

పిల్లల కళ్లలో కంటిశుక్లం రెండు రకాలుగా వస్తుంది. తల్లి పోషకాహార లోపంతో ఉంటే ఆ శిశువుకు ఆహారం నుంచి అవసరమైన పోషకాలు అందవు. ఇది కళ్లలో లోపాన్ని కలిగిస్తుంది. రెండవ రకంలో శిశువుకు 'రుబెల్లా సిండ్రోమ్' వంటి పుట్టుకతో వచ్చే వ్యాధులు ఉంటాయి. దీనికి వంశపారంపర్యత కూడా కొంత వరకు సహకరిస్తుంది. కంటిశుక్లం లెన్స్‌పై ఉండే తెల్లని రంగు. ఇది కంటికి కూడా కనిపిస్తుంది. రానురాను ఇది ఎక్కువ అవుతూ ఉంటుంది. శ్రద్ధ పెట్టకపోతే దృష్టికి అంతరాయం కలిగించడం ప్రారంభిస్తుంది. చికిత్స చేయకుండా వదిలేస్తే పూర్తి అంధత్వం సంభవించవచ్చు.

ఇది  కూడా చదవండి: తెల్లవారుజామున గుండెపోటు ఎందుకు ఎక్కువగా వస్తుంది? కారణాలు తెలుసుకోండి!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు