Viral News: చేపకు బదులుగా పామును తిన్న చిన్నారులు.. చివరికి ఏమైందంటే?

చేప అనుకొని ఇద్దరు చిన్నారులు పామును కాల్చుకొని తిన్న ఘటన ఉత్తరాఖండలోని నైనితాల్ జిల్లా రామ్‌నగర్ పుచ్చడినాయిలో జరిగింది. తల్లిదండ్రులకు తెలియడంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. దీంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వార్త సోషల్‌ మీడియా వైరల్ అవుతుంది.

New Update
Viral News: చేపకు బదులుగా పామును తిన్న చిన్నారులు.. చివరికి ఏమైందంటే?

Viral News: : సోషల్‌ మీడియా వచ్చాక.. కొన్ని పొరపాటు చూస్తే ఆశ్చర్యంగాను, భయానకగాను ఉంటాయి. ఏ వార్త అయినా తెగ వైరల్ అయిపోతాయి. అలాంటి తాజా ఒక వార్త ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో హల్‌చల్ చేస్తుంది. ఈ పని తెలిసి చేస్తారా..? తెలియక చేశారో తెలియదుగాని పిల్లలు మాత్రం సేఫ్ జోన్‌లోనే పడ్డారు. అసలు విషయం ఏమిటని అనుకుంటున్నారా..? అయితే ఒకసారి ఉత్తరాఖండలోని నైనితాల్ జిల్లా రామ్‌నగర్ పుచ్చడినాయి అనే గ్రామానికి వెళ్లాల్సిందే. వెళ్ళటమే కాదు అక్కడ ఏం జరిగిందో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఆ విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం.

చేప అనుకొని పామును తిన్నారు:

ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్న సమీపంలో ఓ చేప కనిపించింది. దానిని చూసిన పిల్లలు చేపను ఇంటికి తీసుకువచ్చి కాల్చుకొని తిన్నారు. అయితే.. నిజానికి పాములకు చేపలకు వేరువేరు ఆకారాలు ఉంటాయి. వాటిని గుర్తు పెట్టడం చాలా సులువుగానే ఉంటుంది. అయితే కొన్ని అరుదుగా కనిపించే చేపల్లో సేమ్ పాములాగానే ఉంటాయి. కాబట్టి వీటిని గుర్తించడం కొద్దిగా కష్టంగానే ఉంటుంది. తాజాగా ఈ పిల్లలు చేప అనుకోని పామును తిన్నారు.

ప్రాణాలతో బయటపడిన పిల్లలు:

ఇంతలో తల్లిదండ్రులు వచ్చి చూడగా పిల్లలు పాముని తింటున్నారు. అది చేప కాదు పామని తెలవగానే దగ్గరిలో ఉన్న పాముల సంరక్షకుడు వద్దకు పిల్లల్ని తీసుకువెళ్లారు. పిల్లలు కాల్చుకొని తిన్న పామును చూసిన అతడు ఇది చాలా విషపూరిత పామని చెప్పాడు. దీంతో పిల్లలకి విషయానికి విరుగుడు ఇచ్చాడు. పిల్లలు సేపు అవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పామును తిన్నాక ఆస్పత్రికి తీసుకెళ్లకుండా పాముల సంరక్షకుడు వద్దకు తీసుకు వెళ్లడంతో ఎవరికి నచ్చిన స్టైల్‌లో వారు కామెంట్లు పెడుతున్నారు. విషపూరితమైన పాము కాదు కాబట్టి పిల్లలు ప్రాణాలతో బ్రతికారు లేకుంటే ఘోరం జరిగేదని మరికొందరు నెటిజెన్లు రియాక్ట్ అవుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

 ఇది కూడా చదవండి:  ప్లాస్టిక్‌ బాటిల్‌కి బీపీకి సంబంధం ఏంటి..? ఈ నీటికి ఉంటేనే మంచిదా..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు