Parenting Tips : పిల్లలు మొండిగానే ఉంటారు..వాళ్లను దారిలోకి తెచ్చుకోండి ఇలా..!!

పిల్లలు మొండిగా ప్రవర్తిస్తున్నారా..? అందుకని పిల్లలకు ఏదైనా వాగ్దానాలు చేస్తే కచ్చితంగా నెరవేర్చాలి. లేకపోతే తల్లిదండ్రుల పట్ల వారికి నమ్మకం పోతుంది. సమయం దొరికినప్పుడల్లా పిల్లలతో సరదాగా గడిపితే పిల్లల్లో ఉన్న మొండితనాన్ని దూరం చేయవచ్చు.

New Update
Parenting Tips : పిల్లలు మొండిగానే ఉంటారు..వాళ్లను దారిలోకి తెచ్చుకోండి ఇలా..!!

Parenting Tips: పిల్లలంటేనే మాట వినరు. వాళ్లకు నచ్చింది చేస్తారే తప్ప.. మనం ఏ మాట చెప్పినా వినకుండా మొండికేస్తారు. అలాంటి సమయంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల కఠినంగా వ్యవహరిస్తారు. కానీ అలాంటి సమయంలో కఠిన పరిష్కారం కరెక్ట్ కాదు. అసలు వాళ్ళు ఎందుకలా ప్రవర్తిస్తున్నారో అనే కారణాలు ముందు తెలుసుకోవాలి. సాధారణంగా పిల్లలందరూ చదువుకోవడం, ఆటలు, తినడం ఇలాంటి విషయాలపై ఒక్కొక్కసారి తల్లిదండ్రులు చెప్పిన మాటలను వినరు. అలా వారికి తోచిందే చేస్తామని గట్టిగా కూర్చుంటారు. ఇలా మొండిగా ప్రవర్తించే పిల్లల పట్ల కొంతమంది తల్లిదండ్రులు కఠినంగా వ్యవహరిస్తుంటారు. అలా చేయడం వల్ల పిల్లలు మారుతారా..? అదే సరైన పరిష్కారమా..? అనేది ఇప్పుడు మనం కొన్ని విషయాలన్నీ తెలుసుకుందాం.

పిల్లలపైన ప్రేమ, శ్రద్ధ అనేది పెట్టాలి

ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు కావడంతో పిల్లలపైన ప్రేమ, శ్రద్ధ అనేది పెట్టడం తగ్గిపోవుతుంది. ఇలాంటి సమయంలో పిల్లలు తమకు నచ్చిన అంశాలను ఎంచుకొని వారికి నచ్చినట్లు చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల తల్లిదండ్రులు ఏది చెప్పినా వాళ్ళు వినకుండా మొండికేస్తారు. అయితే కొంతమంది తల్లిదండ్రులు మాట వింటే ఏదైనా కొనిస్తానని చెబుతూ ఉంటారు. అది వారికి కొనివ్వకపోతే తల్లిదండ్రుల పట్ల పిల్లలకు నమ్మకం పోతుంది. భవిష్యత్తులో కూడా పిల్లలు మీ మాటలు నమ్మే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

ఇది కూడా చదవండి: కేవలం వంటలేకే కాదు..ఉప్పుతో చాలా ఉపయోగాలు

కొంతమంది తల్లిదండ్రులు ఉద్యోగారీత్యా పిల్లల భావోద్వేగాలను అంతగా పట్టించుకోలేదు. ఇలా చేయడం వల్ల పిల్లలలో విసుగు, ఒంటరితనం, అలక వంటి భావాలు అంతర్లీనంగా పెరిగి తల్లిదండ్రులు చెప్పిన మాటలను వినకుండా మొండికేస స్వభావాన్ని పెంచుకుంటారు. అయితే.. ప్రతి పిల్లవాడు తల్లిదండ్రులతో గడపాలని, కబుర్లు చెబుతూ వినాలని కోరుకుంటారు. కానీ తల్లిదండ్రులు వారిని దగ్గరకు రానివ్వకుండా, వారు చెప్పేది వినకుండా ఉంటే వారు పిల్లలు డిప్రెషన్‌కి గురి అవుతారు. అప్పుడు పెద్ద వాళ్ళయినా, తల్లిదండ్రులైన ఏం చెప్పినా వినకుండా మొండికేస్తారు. కావున తల్లిదండ్రులు ఇలాంటి విషయాలను పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని సన్నితంగా మెలగాల్సిన అవసరం చాలా ఉంది. లేదంటే పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినకుండా మొండికేసే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

Advertisment
తాజా కథనాలు